Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Uppena 27 Days Collections: వాటన్నింటికీ షాకిచ్చిన మెగా హీరో.. ‘ఉప్పెన’కు ఇంకో నాలుగు లక్షలు వస్తే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. వారిలో చాలా మంది విఫలం అవగా.. కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. ఈ జాబితాలోకే వస్తాడు.. మెగా ఫ్యామిలీకి చెందిన పంజా వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయిన అతడు.. మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. తద్వారా సినీ చరిత్రలోనే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేశాడు. దాదాపు నాలుగు వారాలుగా ఈ సినిమా జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉంది. దీంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా 27 రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!
‘ఉప్పెన' పుట్టింది ఇలాగే.. వాళ్లంతా కొత్తగానే
మెగా ఫ్యామిలీకి చెందిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన చిత్రమే 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించాడు. ఇందులో విజయ్ సేతుపతి పూర్తి స్థాయి పాత్రను చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కొత్త వాళ్ల కాంబోలో వచ్చిన ఈ చిత్రం హిట్ అయింది.
అంచనాలకు అనుగుణంగానే టార్గెట్ కంప్లీట్
'నీ కన్ను నీలి సముద్రం' అనే పాట, టీజర్, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ రావడంతో ఉప్పెన చిత్రానికి విడుదలకు ముందే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ ప్రపంచ వ్యాప్తంగా చిత్రానికి రూ. 20.50 కోట్లు వ్యాపారం జరిగింది. రూ. 21 కోట్లు టార్గెట్‌తో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లు కష్టమేనని అనుకున్నా.. మూడో రోజే టార్గెట్ ఫినీస్ చేసింది.
27వ రోజు ఎక్కడ? ఎంత వసూలు చేసింది?
చాలా సినిమాలు ఉన్నా 27వ రోజు 'ఉప్పెన' బాగానే రాబట్టింది. బుధవారం నైజాంలో రూ. 2 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1.20 లక్షలు, వెస్ట్‌లో రూ. 60 వేలు, గుంటూరులో రూ. 80 వేలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 50 వేలు రాబట్టింది. మొత్తంగా 27వ రోజు ఈ సినిమాకు రూ. 9 లక్షలు షేర్, రూ. 17 లక్షలు గ్రాస్ వచ్చింది.
27 రోజులకు కలిపి మొత్తం ఎంత వచ్చిదంటే?
'ఉప్పెన' మొదటి రోజు రూ. 9.35 కోట్లు, 2వ రోజు రూ. 6.86 కోట్లు, 3వ రోజు రూ. 8.26 కోట్లు, 4వ రోజు రూ. 4.17 కోట్లు, 5వ రోజు రూ. 3.12 కోట్లు, 6వ రోజు రూ. 1.93 కోట్లు, 7వ రోజు రూ. 1.44 కోట్లు, 8వ రోజు రూ. 1.13 కోట్లు, 9వ రోజు రూ. 1.49 కోట్లు, 10వ రోజు రూ. 2.61 కోట్లు, 11వ రోజు రూ. 1.15 కోట్లు, 12వ రోజు రూ. 80 లక్షలు, 13వ రోజు రూ. 49 లక్షలు, 14వ రోజు రూ. 34 లక్షలు, 15వ రోజు రూ. 40 లక్షలు, 16వ రోజు రూ. 55 లక్షలు, 17వ రోజు రూ. 1.28 కోట్లు, 18వ రోజు రూ. 42 లక్షలు, 19వ రోజు రూ. 29 లక్షలు, 20వ రోజు రూ. 21 లక్షలు, 21వ రోజు రూ. 14లక్షలు, 22వ రోజు రూ. 9 లక్షలు, 23వ రోజు రూ. 13 లక్షలు, 24వ రోజు రూ. 24 లక్షల, 25వ రోజు రూ. 13 లక్షలు, 26వ రోజు రూ. 10 లక్షలతో, 27వ రోజు రూ. 9 లక్షలతో మొత్తంగా రూ. 47.23 కోట్ల షేర్, రూ. 77.50 కోట్ల గ్రాస్ అందుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత? లాభాలు ఏ రేంజ్లో?
27 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 47.23 కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించిన 'ఉప్పెన'.. కర్నాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.35 కోట్లు రాబట్టింది. అలాగే, ఓవర్సీస్లో రూ. 1.38 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా రూ. 50.96 కోట్లు షేర్.. రూ. 83.50 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 21 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ. 29.96 కోట్లు లాభాలను అందుకుంది.
‘ఉప్పెన'కు ఇంకో నాలుగు లక్షలు వస్తే!
'ఉప్పెన' సినిమా విడుదలై నాలుగో వారంలోకి అడుగు పెట్టేసింది. దీని తర్వాత వచ్చిన అల్లరి నరేష్ 'నాంది', నితిన్ నటించిన 'చెక్' బాక్సాఫీస్ రన్‌ను కంప్లీట్ చేసుకున్నాయి. కానీ, ఈ సినిమా మాత్రం ప్రభావం చూపుతూనే ఉంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏవరేజ్‌గా రోజుకు రూ. 10 లక్షలు వసూలు చేస్తూ సత్తా చాటుతోంది ఉప్పెన. దీనికి మరో నాలుగు లక్షలు వస్తే రూ. 51 కోట్లు చేరుతుంది.