Uppena day 4 collections: టాలీవుడ్ రికార్డులపై వైష్ణవ్ దండయాత్ర.. ఏకంగా రెండో స్థానానికి ఉప్పెన
లాక్‌డౌన్ తర్వాత సంక్రాంతి సినిమాలకు కూడా దక్కనంత క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఉప్పెన'. దీంతో మెగా ఫ్యామిలీ వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమయ్యాడు. ఎన్నో అంచనాల నడుమ గత వారం విడుదలైన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా మొదటి రోజే అత్యధిక స్థాయిలో కలెక్షన్లు సాధించి.. రికార్డులు క్రియేట్ చేసింది. అదే స్పందనను అందుకుంటూ మూడు రోజుల్లోనే లాభాల్లోకి చేరుకుంది. ఇక, నాలుగో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. పలు రికార్డులను అందుకుంది. ఆ వివరాలు మీకోసం!

అంతా కొత్త వాళ్లే.. రిజల్ట్ మాత్రం గొప్పగా
రిలీజ్‌కు ముందే బజ్ పెంచుకున్న చిత్రం 'ఉప్పెన'. ఈ చిత్రం ద్వారా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అవగా.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఇక, విజయ్ సేతుపతి తెలుగులో తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. వీళ్లంతా మంచి ఔట్‌పుట్ ఇచ్చారు.

టాక్‌తో సంబంధం లేకుడా భారీ రెస్పాన్స్
ఎన్నో అంచనాల నడుమ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'ఉప్పెన'. మొదటి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుందీ సినిమా. దీంతో ఈ మూవీ భవితవ్యంపై ఎన్నో అనుమానాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయిందీ సినిమా. తద్వారా కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. దీంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.

మూడు రోజుల్లోనే ఫినీష్ చేసిన ‘ఉప్పెన'
'నీ కన్ను నీలి సముద్రం' అనే పాటతో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి రూ. 20.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21 కోట్లు అనుకున్నారు. ఇక, దీన్ని కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేసిందీ మెగా హీరో మూవీ. అంతేకాదు, లాభాలను కూడా అందుకుంది.

నాలుగో రోజు ఎక్కడ.. ఎంత.. రాబట్టింది?
ఉప్పెన నాలుగో రోజూ మంచి స్పందననే అందుకుంది. ప్రాంతాల వారిగా చూస్తే.. నైజాంలో రూ. 1.33 కోట్లు, సీడెడ్‌లో రూ. 74 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 78 లక్షలు, ఈస్ట్‌లో రూ. 47.80 లక్షలు, వెస్ట్‌లో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 27 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలు రాబట్టింది. మొత్తంగా నాలుగో రోజు రూ. 4.17 కోట్లు షేర్, రూ. 7 కోట్ల గ్రాస్ వచ్చింది.

నాలుగు రోజుల మొత్తం కలెక్షన్లు ఎంత?
ప్రపంచ వ్యాప్తంగా వెయికి పైగా థియేటర్లలో విడుదలైన 'ఉప్పెన' ఓపెనింగ్ డే నుంచి మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమా మొదటి రోజు రూ. 9.35 కోట్లు, రెండో రోజు రూ. 6.86 కోట్లు వసూలు చేసింది. ఇక, మూడో రోజు ఊహించని విధంగా రూ. 8.26 కోట్లు రాబట్టింది. నాలుగో రోజు రూ. 4.17 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 28.64 కోట్లు షేర్, రూ. 45.80 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఏకంగా రెండో స్థానానికి చేరిన ‘ఉప్పెన'
మొదటి రోజు నుంచే అత్యధిక స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ 'ఉప్పెన' ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఇందులో భాగంగానే నాలుగో రోజు రూ. 4.17 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. నాలుగో రోజు ఎక్కువ కలెక్ట్ చేసిన మీడియం రేంజ్ చిత్రాల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక, ఈ జాబితాలో రామ్ నటించిన 'ఇస్మార్ట్ శంకర్' రూ. 4.80 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా కలుపుకుంటే ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన 'ఉప్పెన'. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుతోంది. ఈ చిత్రం కర్నాటకలో రూ. 25 లక్షలు, చెన్నైలో రూ. 10 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 30 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా రూ. 75 లక్షలు రాబ్టటింది. ఇవి కూడా కలుపుకుంటే నాలుగు రోజుల్లో రూ. 29.39 కోట్లు కలెక్ట్ చేసిందీ సినిమా.


Click it and Unblock the Notifications











