Uppena Total Collections: ఆశ్చర్యంగా ఉప్పెన క్లోజింగ్ కలెక్షన్స్.. తెలుగులో రెండో మూవీగా రికార్డ్!

టాలీవుడ్‌లోనే మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కాబట్టే ఆ ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోగా పరిచయం అయినా.. అదిరిపోయే లాంఛింగ్ దక్కింది. ఇప్పుడిదే కంటిన్యూ చేస్తూ పంజా వైష్ణవ్ తేజ్ ఎంట్రీ కూడా అదే రీతిలో జరిగింది. అతడు హీరోగా పరిచయం అయిన సినిమానే 'ఉప్పెన'. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే, కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఫలితంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. ఇంతటి ప్రభావాన్ని చూపిన ఈ సినిమా క్లోజింగ్ రిపోర్టులు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం!

జాతి రత్నాలు సక్సెస్ మీట్: నవీన్ పోలిశెట్టి హ్యాపీ (ఫొటోలు)

 ‘ఉప్పెన' మొదలైందిలా.. ఆరంభమే అదిరిపోయేలా

‘ఉప్పెన' మొదలైందిలా.. ఆరంభమే అదిరిపోయేలా

పంజా వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా టాలీవుడ్‌కు పరిచయమైన చిత్రం 'ఉప్పెన'. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన రూపొందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి నెగెటివ్ రోల్‌ను చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం ద్వారా కొత్త వాళ్లకు అదిరిపోయే ఆరంభం దక్కింది.

భారీ స్థాయిలో బిజినెస్.. మూడు రోజుల్లోనే కంప్లీట్

భారీ స్థాయిలో బిజినెస్.. మూడు రోజుల్లోనే కంప్లీట్

మెగా ఫ్యామిలీకి చెందిన హీరో ఎంట్రీ ఇస్తుండడంతో పాటు 'నీ కన్ను నీలి సముద్రం' పాట, టీజర్, ట్రైలర్‌లకు భారీ రెస్పాన్స్ రావడంతో ఉప్పెనపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 20.50 కోట్లు వ్యాపారం జరిగింది. రూ. 21 కోట్లు టార్గెట్‌తో రిలీజ్ అయిన దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లు కష్టమేనని అనుకున్నారు. మూడో రోజే టార్గెట్ ఫినీస్ చేసింది.

హీరో కార్తికేయ లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్.. చావు కబురు చల్లగా సక్సెస్‌పై కన్నేసిన యువ హీరో (ఫొటోలు)

ఉప్పెన ఏపీ తెలంగాణ కలెక్షన్లు.. ప్రాంతాల వారీగా

ఉప్పెన ఏపీ తెలంగాణ కలెక్షన్లు.. ప్రాంతాల వారీగా

'ఉప్పెన' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. మొత్తంగా నైజాంలో రూ. 15.63 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.80 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.58 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.08 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.63 కోట్లు, గుంటూరులో రూ. 3.01 కోట్లు, కృష్ణాలో రూ. 3.21 కోట్లు, నెల్లూరులో రూ. 1.78 కోట్లతో మొత్తంగా ఈ సినిమాకు రూ. 47.72 కోట్లు షేర్, రూ. 51.52 కోట్లు గ్రాస్ వచ్చింది.

రెండు ప్రాంతాలతో కలిపితే వచ్చిన కలెక్షన్లు ఎంత?

రెండు ప్రాంతాలతో కలిపితే వచ్చిన కలెక్షన్లు ఎంత?

తెలుగు రాష్ట్రాల్లో రూ. 47.72 కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించిన 'ఉప్పెన'.. కర్నాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.38 కోట్లు రాబట్టింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 1.42 కోట్లు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 51.52 కోట్లు షేర్.. రూ. 85 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి సత్తా చాటింది.

టార్గెట్ ఎంత? వచ్చిందెంత? లాభాలు ఏ రేంజ్‌లో?

టార్గెట్ ఎంత? వచ్చిందెంత? లాభాలు ఏ రేంజ్‌లో?

ముగింపు సమయానికి 47.72 కోట్లతో సత్తా చాటిన 'ఉప్పెన'.. ప్రాఫిటబుట్ మూవీగా నిలిచింది. ఈ చిత్రానికి రూ. 20.50 కోట్లు వ్యాపారం జరిగడంతో.. రూ. 21 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నమోదైంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 51.52 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. రూ. 30.52 కోట్ల లాభాలను అందుకుంది. తద్వారా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది.

తెలుగులో రెండో మూవీగా రికార్డు... అలా ఏడోది

తెలుగులో రెండో మూవీగా రికార్డు... అలా ఏడోది

'ఉప్పెన' సినిమా విడుదలైనప్పటి నుంచే సత్తా చాటింది. ఈ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. మరీ ముఖ్యంగా ఎక్కువ కలెక్షన్లు సాధించిన మీడియం రేంజ్ చిత్రాల జాబితాలో ఇది రెండో స్థానంలో నిలిచింది. రూ. 55.43 కోట్లతో మొదటి స్థానంలో 'గీత గోవిందం' ఉంది. ఇక, నాన్ బాహుబలి కేటగిరిలో ఎక్కువ లాభాలు అందుకున్న చిత్రాల్లో ఏడో స్థానంలో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X