Vakeel Saab 11 days collections: ఇంకా నష్టాల్లోనే వకీల్ సాబ్.. ఆ మైలురాయిని దాటటం అసాధ్యమేనా?

పవన్ కల్యాణ్ తొలిసారి లాయర్‌గా కనిపిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ చిత్రం భారీ కలెక్షన్లనే నమోదు చేసింది. అయితే ఆరంభంలో సాధించిన వసూళ్లను నిలబెట్టుకోలేక నష్టాల దిశగా ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తున్నది. 11వ రోజు వకీల్ సాబ్ కలెక్షన్లు భారీగా పడిపోవడానికి కారణం ఏమిటంటే...

తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ పరిస్థితులు రికార్డు స్థాయిని మించి నమోదు కావడంతో థియేటర్లకు ప్రేక్షకులు దూరమవుతున్నారు. ఈ క్రమంలో వకీల్ సాబ్ కలెక్షన్లు దారుణంగా క్షీణించాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నారు.

Vakeel Saab 11 days collections: Pawan Kalyan movie is struggling to reach break even mark

ఇక 11వ రోజున వకీల్ సాబ్ చిత్రం నైజాంలో 20 లక్షలు, సీడెడ్‌లో 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.5 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.7 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 లక్షలు, గుంటూరులో రూ.6 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.5 లక్షలు, నెల్లూరు జిల్లాలో రూ.3 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో రూ.61 లక్షల షేర్, రూ.95 లక్షల గ్రాస్‌ కలెక్షన్లను నమోదు చేసింది. ఇక మొత్తంగా ఏపీ, తెలంగాణలో రూ.77.23 కోట్ల షేర్, రూ.119.15 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా వసూళ్లను పరిశీలిస్తే.. కర్ణాటకలో రూ.3.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.75 కోట్లు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా రూ.84.63 కోట్ల షేర్, రూ.135 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో 150 కోట్ల మైలురాయిని దాటడం కష్టంగా మారిందని పేర్కొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X