Vakeel saab 3 days collections: 100కోట్లకు చేరువలో పవర్ స్టార్.. బాక్సాఫీస్ సునామీ ఆగేలా లేదు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకుంది. సినిమా విడుదలైన మూడు రోజుల తరువాత కూడా అదే ఉపులో వెలుతోంది. ఆంద్రప్రదేశ్ లో టికెట్స్ రేట్లల్లో రాజకీయాల ప్రభావం పడినా కూడా పవర్ స్టార్ మార్కెట్ పై అంతగా ప్రభావం పడలేదు. ఇక సినిమాకు సంబంధించిన మూడు రోజుల కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

Recommended Video

Vakeel Saab 3rd Day Public Response & Record Collections | #PawanKalyan | Filmibeat Telugu
ఓపెనింగ్స్ తోనే అదరగొట్టేసిన వకీల్ సాబ్

ఓపెనింగ్స్ తోనే అదరగొట్టేసిన వకీల్ సాబ్

ఆజ్ఞాతవాసి సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో ఆ గ్యాప్ ను మర్చిపోయెలా చేశాడు. పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ అందుకుంది. మొత్తానికి సినిమా పవర్ఫుల్ విజయాన్ని అందుకుంది. రివ్యూలు కూడా చాలా పాజిటివ్ గా వచ్చాయి.

100కోట్లకు దగ్గరలో

100కోట్లకు దగ్గరలో

ఇక వకీల్ సాబ్ విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ గా నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలను అందించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా టాక్ తో సంబంధం లేకుండా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటాయని అర్ధమయ్యింది. ఇక ఫస్ట్ వీకెండ్ లో మొత్తానికి సినిమా 90కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసినట్లు తెలుస్తోంది.

మూడు రోజుల్లో వచ్చిన మొత్తం షేర్

మూడు రోజుల్లో వచ్చిన మొత్తం షేర్

ఇక మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నైజాం 16కోట్లు, సీడెడ్ 8.05కోట్లు వైజాగ్ 7.70కోట్లు, ఈస్ట్ 4.30కోట్లు, వెస్ట్ 5.60కోట్లు, గుంటూరు 5.25కోట్లు, కృష్ణ 3.15కోట్లు, నెల్లూరు 2.50కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో 3రోజుల్లో వచ్చిన మొత్తం షేర్ 52.50కోట్లు.

 వరల్డ్ వైడ్ గా..

వరల్డ్ వైడ్ గా..

వరల్డ్ వైడ్ గా 90కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న వకీల్ సాబ్ 60కోట్లకు పైగా షేర్ ను రాబట్టినట్లు సమాచారం. ఓవర్సీస్ లో కూడా సినిమా కలెక్షన్స్ సాలీడ్ గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇప్పటివరకు 60కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న 4వ సినిమాగా వకీల్ సాబ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.కర్ణాటకతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం చూసుకుంటే 3.15కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ లో అయితే 3.30కోట్ల షేర్ వరకు రాబట్టినట్లు సమాచారం. ఈ విధంగా సినిమా అన్ని దారుల్లో మంచి కలెక్షన్స్ అందుకుంది.

ఇంకా ఎంత రావాలంటే..

ఇంకా ఎంత రావాలంటే..

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 89.35కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 89.5కోట్లు. ఆ టార్గెట్ ను అందుకోవాలి అంటే మరో 30.18కోట్ల షేర్ ను రాబట్టాలి.

సినిమా ఇదే స్పీడ్ లో కలెక్షన్స్ అందుకుంటే ఆ టార్గెట్ ను ఈజీగా అందుకుంటుందని చెప్పవచ్చు. ఇక చిత్ర యూనిట్ ప్రమోషన్ విషయంలో కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.త్వరలోనే సక్సెస్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X