twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vakeelsaab 9 days collections: టార్గెట్‌కు ఇంకా కొద్దీ దూరంలోనే.. కోవిడ్ కష్టకాలంలో సాధ్యమేనా?

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ ఓపెనింగ్స్ అందుకుంది. విడుదలైన తొలి వీకెండ్ లోనే కెరీర్ బిగ్గెస్ట్ షేర్ అందుకున్న పవర్ స్టార్ రాజకీయ ఇబ్బందులు ఎదురైనా కూడా బాక్సాఫీస్ వద్ద బాగానే రానించాడు. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ప్రకారం సినిమా మరికొన్ని రోజులు థియేటర్స్ లో ఉండక తప్పదు. ఇక 9రోజుల్లో సినిమా అందుకున్న కలెక్షన్స్ మొత్తం ఏ స్థాయిలో ఉన్నాయంటే..

    రీమేక్ అయినప్పటికీ

    రీమేక్ అయినప్పటికీ

    ఆజ్ఞాతవాసి సినిమాతో మూడేళ్ళ క్రితం డిజాస్టర్ అందుకున్న పవర్ స్టార్ చాలా గ్యాప్ తరువాత చేసిన చిత్రం వకీల్ సాబ్. హిందీ సినిమాకు రీమేక్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. మొత్తానికి పవన్ బాక్సాఫీస్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని మరోసారి ఋజువయ్యింది.

    అప్పుడే అర్ధమయ్యింది..

    అప్పుడే అర్ధమయ్యింది..

    వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ గా నిర్మాత దిల్ రాజుకు మంచి ప్రాఫిట్స్ ను అందించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్కెట్ వాల్యుఏ రేంజ్ లో ఉందొ ఉందొ అప్పుడే అర్ధమయ్యింది. నాన్ థియేట్రికల్ గానే వకీల్ సాబ్ 50కోట్లకు పైగా లాభాలను అందించినట్లు సమాచారం.

    9 రోజుల్లో వచ్చిన మొత్తం షేర్

    9 రోజుల్లో వచ్చిన మొత్తం షేర్

    ఇక బాక్సాఫీస్ వద్ద 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నైజాం 23.79కోట్లు, సీడెడ్ 13.32కోట్లు, ఉత్తరాంధ్ర 11.21కోట్లు, ఈస్ట్ 6.09కోట్లు, వెస్ట్ 6.61కోట్లు, గుంటూరు 6.79కోట్లు, కృష్ణ 4.69కోట్లు, నెల్లూరు 3.22కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో 9రోజుల్లో వచ్చిన మొత్తం షేర్ 74.72కోట్లు.

    ప్రపంచవ్యాప్తంగా..

    ప్రపంచవ్యాప్తంగా..

    వరల్డ్ వైడ్ గా 9రోజుల్లో 130.50కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న వకీల్ సాబ్ 82.01కోట్లకు పైగా షేర్ ను రాబట్టినట్లు సమాచారం. ఓవర్సీస్ లో కూడా సినిమా కలెక్షన్స్ సాలీడ్ గా ఉన్నాయి. పవర్ స్టార్ కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు 60కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న 4వ సినిమాగా వకీల్ సాబ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

    అన్ని దారుల్లో..

    అన్ని దారుల్లో..

    కర్ణాటకతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం చూసుకుంటే 3.59కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ లో అయితే 3.70కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఈ విధంగా సినిమా అన్ని దారుల్లో మంచి కలెక్షన్స్ అందుకుంది.

    Recommended Video

    Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
     బ్రేక్ ఈవెన్ టార్గెట్..

    బ్రేక్ ఈవెన్ టార్గెట్..

    వకీల్ సాబ్ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 89.35కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 90కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇక 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 82.01కోట్ల షేర్ అందుకున్న పవర్ స్టార్ ప్రాఫిట్స్ లోకి రావాలి అంటే మరో 7.99కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కోవిడ్ ఎక్కువవుతున్న తరుణంలో ఆ టార్గెట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

    English summary
    Power star Pawan Kalyan's eagerly awaited lawyer Saab movie trailer has just arrived. It is learned that the film, which was supposed to be released last year, has been postponed due to Corona. Dil Raju has increased the promotion dose as the response to the films has been huge. The movie trailer was first released in theaters and later on YouTube.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X