వకీల్‌సాబ్ నుంచి RRR వరకు ఫస్ట్‌డే వసూళ్ల అంచనా.. బాక్సాఫీస్‌ను హడలెత్తించేందుకు భారీ బడ్జెట్ చిత్రాలు రెడీ!

వకీల్‌సాబ్

లాక్‌డౌన్ కారణంగా స్థంభించిన టాలీవుడ్ ఇప్పుడిప్పుడే మరింత జోష్‌తో ముందుకెళ్తున్నది. పలు చిన్న, మధ్య తరగతి చిత్రాలతోపాటు భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచారు. అయితే రానున్న భారీ బడ్జెట్ చిత్రాలపై ట్రేడ్ వర్గాలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. వారి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాపంగా తొలి రోజు అంచనాలు ఇలా ఉన్నాయి.

వకీల్ సాబ్ ఫస్ట్ డే కలెక్షన్ల అంచనా

వకీల్ సాబ్ ఫస్ట్ డే కలెక్షన్ల అంచనా


మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తెలుగు వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన నటించిన వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్ కానున్నది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం వకీల్ సాబ్ తొలి రోజున రూ.60 నుంచి రూ.65 కోట్ల మేర కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది.

సముద్రం ఒడ్డున బీర్ బాటిల్‌తో యంగ్ బ్యూటీ.. ఒయ్యారాలు ఒలికించిన ఆషికా రంగనాథ్

ఆచార్య తొలి రోజున రికార్డు వసూళ్ల అంచనా

ఆచార్య తొలి రోజున రికార్డు వసూళ్ల అంచనా

ఇక సైరా చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ మే 13 తేదీన విడుదలకు సిద్ధం అవుతున్నది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న కొరటాల శివ, చిరంజీవి కాంబినేసన్‌లో వస్తున్న తొలి చిత్రం కావడంతో భారీ క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లపై భారీగా అంచనాలు పేరుకొన్నాయి. తొలి రోజున ఈ చిత్రం రూ.65 నుంచి రూ.70 కోట్ల మేర రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రభాస్ చూపు రూ.100 కోట్లకుపైగానే

ప్రభాస్ చూపు రూ.100 కోట్లకుపైగానే


సాహో మూవీ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం రాధేశ్యామ్. ఈ చిత్రం మే 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. లాక్‌డౌన్ కారణంగా ఈ చిత్రం విడుదల ఏడాదిపాటు ఆలస్యం కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చేస్తున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం తొలి రోజున రూ.100 కోట్లకుపైగా వసూలు చేస్తుందనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో ఉన్నాయి.

KGF1కు మించిన వసూళ్లు

KGF1కు మించిన వసూళ్లు

ఇక ఈ ఏడాది ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తున్న చిత్రంగా KGF2 చిత్రం అత్యంత క్రేజ్‌ను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం జూలై 16వ తేదీన రిలీజ్ సిద్దం అవుతున్నది. కేజీఎఫ్1 చిత్రం సాధించిన రికార్డు వసూళ్ల కారణంగా ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా సాధించే అవకాశం ఉందనే లెక్కలను ట్రేడ్ వర్గాలు వేస్తున్నాయి.

పుష్ప గురి రూ.70 కోట్లకుపైగానే

పుష్ప గురి రూ.70 కోట్లకుపైగానే

అల వైకుంఠపురంలో చిత్రంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే అత్యధికంగా రూ.200 కోట్ల కలెక్షన్లను ఖాతాలో వేసుకొన్నారు. ఈ సినిమా తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి పుష్ప చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం రూ.70 కోట్లకుపైగా వసూళ్లను రాబట్ట వచ్చనే అంచనాకు ట్రేడ్ వర్గాలు వచ్చాయి. ఈ చిత్రం ఆగస్టు 13వ తేదీన రిలీజ్ కానున్నది.

దిమ్మ తిరిగేలా RRR ఫస్ట్ డే కలెక్షన్ల అంచనా

దిమ్మ తిరిగేలా RRR ఫస్ట్ డే కలెక్షన్ల అంచనా

2020లో రిలీజ్ కావాల్సిన RRR చిత్రం లాక్‌డౌన్ కారణంగా పలు మార్లు రిలీజ్ డేట్ వాయిదా పడింది. అయితే ఈ చిత్రం అక్టోబర్ 13వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. బాహుబలి సిరీస్‌ తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్మిస్తున్న చిత్రం కావడం అలాగే రాంచరణ్, ఎన్టీఆర్‌తో మల్టీ స్టారర్ మూవీ రూపొందించడంతో విశేషంగా ఈ సినిమాపై ప్రేక్షకదరణ పెరిగింది. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిన చిత్రం తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందనే అంచనాలు ట్రేడ్ వర్గాలు వేస్తున్నాయి.

Recommended Video

Vakeel Saab : April Sentiment ,Boon Or Bane For Pawan Kalyan ?
బాక్సాఫీస్ రికార్డులపై మహేష్ బాబు నజర్

బాక్సాఫీస్ రికార్డులపై మహేష్ బాబు నజర్

ప్రస్తుత ఏడాదిలో అత్యంత క్రేజ్ ఉన్న చిత్రంగా సర్కారు వారి పాట ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. గీతగోవిందం ఫేమ్ పరుశురామ్, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ తొలిసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సహజంగా ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి నెలకొన్నది. ఈ చిత్రం ఫస్ట్ డేన రూ.70 కోట్లకుపైగానే వసూలు చేస్తుందనే ప్రచారం ట్రేడ్ వర్గాల్లో జరుగుతున్నది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X