వకీల్ సాబ్ అరాచకం.. బుక్ మై షోలో టిక్కెట్టు దొరికితే ఒట్టు.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
సినిమా విడుదలకు ఇంకా నాలుగు రోజులు ఉన్నప్పటికీ బుక్ మై షోలో హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. లాక్ డౌన్ తరువాత ఈ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఏ సినిమాకు రాలేదు. మాస్ ఏరియాల్లో టిక్కెట్ల కోసం హార్డ్ కోర్ ఫ్యాన్స్ వారం ముందు నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక ఆన్ లైన్ లో బుకింగ్స్ మొదలైన కొన్ని గంటలకే దాదాపు అన్ని థియేటర్స్ లు ఫుల్ అయ్యాయి. ఇక బాక్సాఫీస్ టార్గెట్ ను అందుకోవడానికి వకీల్ సాబ్ కు ఎక్కువ సమయం పట్టేలా లేదు.

ప్లాప్ టాక్ వచ్చినా..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ ఓపెనింగ్స్ తో షేక్ అవ్వాల్సిందే. ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. అందుకు ఉదాహరణ ఆజ్ఞాతవాసి అని చెప్పవచ్చు.

ఒక్క టిక్కెట్టు దొరికితే ఒట్టు
వకీల్ సాబ్ ఈ నెల 9న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక బుక్ మై షోలో 5రోజుల ముందే అడ్వాన్స్ బూకింగ్స్ మొదలవ్వగా నిమిషాల్లోనే హౌజ్ ఫుల్ అవ్వడం అందరికి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ మెయిన్ సెంటర్స్ లలో అయితే ఒక్క టిక్కెట్టు దొరికితే ఒట్టు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సునామి చూస్తుంటే
మొదట 215 షోలకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అవ్వగా ఆల్ మోస్ట్ అన్ని షోల టికెట్లు అమ్ముడయ్యాయి. ట్రైలర్ తోనే సినిమాపై ఉన్న బజ్ ఏమిటో చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. ఇక ఈ సునామి చూస్తుంటే వకీల్ సాబ్ బాక్సాఫీస్ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అనిపిస్తోంది.

సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇక బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ కు రికార్డులు కొత్తేమి కాదు. యావరేజ్ టాక్ వచ్చినా ఒక రేంజ్ లో సంచలనం సృష్టిస్తాయి. ఇక వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ గా 83.35కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 84కోట్లు. టాలీవుడ్ లో లాక్ డౌన్ అనంతరం అత్యదిక టార్గెట్ తో విడుదలవుతున్న చిత్రం ఇదే. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











