Vakeel Saab Collections ఫస్ట్‌డే రిపోర్టు నిలిపివేత.. ఏపీ సర్కార్ జోక్యంతో గందరగోళం.. ఆందోళనలో ఎగ్జిబిటర్లు

ఏపీలో వకీల్ సాబ్ టికెట్ల రేటు పెంపు విషయం అత్యంత రచ్చగా మారబోతున్నది. ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ బెట్టు చేసే విధంగా ఉండటంతో వివాదంగా మారింది. కోర్టు ఆదేశాలను కూడా సవాల్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పిటిషన్ల దాఖలు చేయడంతో ఎగ్జిబిటర్లు ఆందోళనలో పడిపోయారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

 సాధారణంగా టికెట్ రేట్ల పెంపు

సాధారణంగా టికెట్ రేట్ల పెంపు

తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టికెట్ల రేట్లు పెంపు అంశం రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. సాధారణంగా పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు రూ.150 నుంచి 200 మధ్య టికెట్ రేటును పెంచుకొనే వారు. కానీ వకీల్ సాబ్ సినిమా విషయంలో టికెట్ల రేటు పెంపుపై ఏపీ ప్రభుత్వం అంక్షలు విధించింది.

గుంటూరులో అత్యధిక రేట్లకు

గుంటూరులో అత్యధిక రేట్లకు

అయితే వకీల్ సాబ్ రిలీజ్ రోజున ప్రత్యేక షోలకు అనుమతించకపోగా, టికెట్ల రేటుపై ఆంక్షలు విధించడంతో రూ.80 నుంచి 100 మధ్య అమ్మారు. అయితే టికెట్లు రేట్లు పెంచిన థియేటర్ యాజమాన్యాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝులిపించారు. గుంటూరులో ఎక్కువ మొత్తానికి అమ్మిన నేపథ్యంలో ప్రేక్షకులకు ఆ మొత్తాన్ని వాపసు చేసేలా చర్యలు తీసుకొన్నారు.

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో టికెట్లు రేట్లు పెంచే విషయంలో ఎగ్జిబిటర్లూ వెనకడుగు వేస్తున్నారు. ఒకవేళ కోర్టు ఆదేశాల మేరకు టికెట్ రేట్లు పెంచి అమ్మితే ఏపీ ప్రభుత్వ అధికారులు తమ థియేటర్లను సీజ్ చేస్తారనే ఆందోళనలో ఎగ్జిబిటర్లు పడ్డారు. దాంతో అధికారికంగా నిర్ణయించిన టికెట్ రేట్లకే అమ్మాలనే నిర్ణయంలో థియేటర్ యాజమాన్యాలు ఉన్నారు.

లెక్క తేలని కలెక్షన్లు

లెక్క తేలని కలెక్షన్లు

ఇదిలా ఉండగా, వకీల్ సాబ్ తొలి రోజు కలెక్షన్లను ట్రేడ్ వర్గాలు నిలిపివేశారు. టికెట్ల రేటు పెంపు విషయంలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్లను ఆపివేసినట్టు సమాచారం. అయితే ఫస్ట్ డే కలెక్షన్ల లెక్కింపు వ్యవహారం గందరగోళంగా మారినట్టు సమాచారం. పలు ప్రాంతాల నుంచి వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది.

Recommended Video

Vakeel Saab కి అండగా Mega Family ! | Ram Charan | Pawan Kalyan
లెక్కింపులో జాప్యం

లెక్కింపులో జాప్యం

ఏపీ, నైజాంలో పలు ప్రాంతాల్లో టికెట్ల రేట్లు ఒక్కోరకంగా ఉన్నాయి. కొన్ని చోట్ల టికెట్ రేట్లు పెంచడం, కొన్ని చోట్ల మరోక రకంగా ఉండటంతో తొలి రోజు కలెక్షన్లను లెక్కించడంలో కొంత జాప్యం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ఉన్న లెక్కలను సెట్ చేయడంలో ఆలస్యమైంది. త్వరలోనే అధికారికంగా వసూళ్లను బయటపెట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X