Vakeel Saab 12th day collections..బాక్సాఫీస్ వద్ద గడ్డుపరిస్థితి.. రికార్డుకు అడుగు దూరంలో...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ ప్రయాణం ముగిసినట్టే కనిపిస్తున్నది. కరోనావైరస్ కారణంగా నైజాంలో థియేటర్లను మూసివేయడం, కర్ఫ్యూ పెట్టడం లాంటి అంశాలు సినిమాపై భారీగా ప్రభావం చూపించినట్టు కనిపిస్తున్నది. ఇక ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో ఉండటం కూడా వకీల్ సాబ్ వసూళ్ల క్షీణతకు కారణమైందనే మాట వినిపిస్తున్నది.
మాస్టర్ హీరోయిన్ క్లీవేజ్ షో.. చీరకట్టులో సరికొత్త అందాలు
ఇక వకీల్ సాబ్ 12వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఏపీ, తెలంగాణలో అతి తక్కువ కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది. 11వ రోజున కలెక్షన్లను పరిగణనలోకి తీసుకొంటే పలు ప్రదేశాల్లో అత్యల్ప గణాంకాలు నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా వకీల్ సాబ్ కలెక్షన్లను చూస్తే.. ఏపీ, నైజాంలో రూ.77.23 కోట్ల నికర, 120 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.3.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.75 కోట్లు వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.84 కోట్లకుపైగా నికర వసూళ్లను, రూ.135 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొన్నది.
ఇక 12వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం రూ.50 నుంచి 75 లక్షల రూపాయల కలెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే 150 కోట్ల మైలురాయికి అడుగు దూరంలో ఆగిపోయే పరిస్థితి కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











