For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vakeel Saab Day 3 collections: బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత.. ఆ పరిస్థితులను తొక్కేసిన పవన్ కల్యాణ్ మూవీ

    |

    పింక్ ప్రీమేక్‌గా వచ్చిన చిత్రం వకీల్ సాబ్ ప్రపంచవ్యాప్తం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోతను మోగిస్తున్నది. అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదురించిన ఈ చిత్రం తొలి రోజున రూ.45 కోట్ల గ్రాస్‌ను సాధించింది. అలాగే రెండో రోజున కూడా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఇక మూడో రోజున కూడా అదే ఊపును కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో ట్రేడ్ పండితులు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం 3వ రోజున ఏ మేరకు వసూళ్లను సాధించనున్నదంటే..

    మూడో రోజున నిలకడగా కలెక్షన్లు

    మూడో రోజున నిలకడగా కలెక్షన్లు

    వకీల్ సాబ్ చిత్రం మూడో రోజున బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధించింది. గుంటూరు, కడప, నెల్లూరు, గాజువాక, ఎమ్మిగనూరు, ఖమ్మం, శ్రీహరిపురం, కొవ్వూరు, మచిలిపట్నం, భీమవరం, వైజాగ్, ఏలూరు, విజయవాడలో హౌస్ ఫుల్ కలెక్షన్లు నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్టు. అనంతపూరంలో కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను కూడగట్టుకొంటున్నది.

    నైజాంలో స్ట్రాంగ్‌గా

    నైజాంలో స్ట్రాంగ్‌గా

    ఇక నైజాంలో కూడా పలు చోట్ల రికార్డు కలెక్షన్లు సాధించింది. మహబూబ్ నగర్‌ టౌన్‌లో మూడు రోజులకు కలిపి రూ.30 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించింది. మూడో రోజున రూ.7 లక్షల వసూళ్లను రాబట్టింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజమాబాద్ పట్టణాల్లో భారీగా వసూళ్లను నమోదు చేసినట్టు సమాచారం.

    ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల వసూళ్లు

    ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల వసూళ్లు

    వకీల్ సాబ్ రెండో రోజుల తర్వాత ఏపీ, నైజాంలో కలిపి రూ.42.5 కోట్ల షేర్, మిగితా రాష్ట్రాల్లో రూ.5.75 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.48.25 కోట్ల షేర్, 72 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మొత్తం 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఈ చిత్రం 54 శాతం వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తున్నది.

    అమెరికాలో రికార్డు దిశగా

    అమెరికాలో రికార్డు దిశగా

    వకీల్ సాబ్ చిత్రం అమెరికాలో విజయఢంకా మోగిస్తున్నది. లాక్‌డౌన్ తర్వాత హాలీవుడ్ మూవీ కలెక్షన్లకు ధీటుగా, భారతీయ సినిమాకు నమోదు కానటువంటి కలెక్షన్లు వస్తున్నాయి. మూడో రోజున ఈ చిత్రం 600k అమెరికా డాలర్లను వసూలు చేసింది. ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నది.

     ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో

    ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో

    ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో వకీల్ సాబ్ చిత్రం భారీగాను కలెక్షన్లు వసూలు చేసింది. ఆస్ట్రేలియాలో ఈ చిత్రం తొలి రోజున 147,571 ఆస్ట్రేలియా డాలర్లు, రెండో రోజున 64,286 డాలర్ల వసూలుతో మొత్తంగా 211,857 వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో రూ.1.2 కోట్లు రాబట్టింది. ఇక న్యూజిలాండ్‌లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. తొలి రోజున 9,826 డాలర్లు, రెండో రోజున 7879 న్యూజిలాండ్ డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా 17705 డాలర్లు అంటే 9.3 లక్షల రూపాయలు సాధించింది.

    మూడో రోజు కలెక్షన్ల అంచనా

    మూడో రోజు కలెక్షన్ల అంచనా

    ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం... మూడో రోజు ఆదివారం నాడు వకీల్ సాబ్ మంచి కలెక్షన్లను రాబట్టింది. అన్ని ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మూడో రోజున రూ.25 కోట్ల నుంచి 30 కోట్ల కలెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉంది. దీంతో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌కు చేరువయ్యే అవకాశం ఉంది.

    4వ రోజున అడ్వాన్స్ బుకింగ్ పరిస్థితి

    4వ రోజున అడ్వాన్స్ బుకింగ్ పరిస్థితి

    తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ పరిస్థితుల విజృంభణ నేపథ్యంలో కూడా వకీల్ సాబ్ చిత్రం నైజాం, ఆంధ్రాలో ఓ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 4వ రోజున హైదరాబాద్‌లో 76 షోలు, వైజాగ్‌లో 45 షోలు, విజయవాడలో 125 షోలు, నెల్లూరులో 24 షోలు ప్రదర్శించనున్నారు. పలు చోట్ల దాదాపు 50 శాతానికి పైగా కలెక్షన్లు నమోదు అవుతున్నట్టు సమాచారం.

    English summary
    Vakeel Saab Day 3 expected collections: Power Star Pawan Kalyan's Vakeel Saab is set to release on April 9th. This movie trailer set a new record in Tollywood. Vakeel Saab trailer gaint 23.4 million views in 24 hours. In this occassion, Fimibeat Telugu brings Day 3 expected collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X