Don't Miss!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్‌జున్‌వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
Vakeel Saab Day 6 collections: 150 కోట్ల క్లబ్ వైపు దూకుడు.. ప్రాఫిట్లోకి రావాలంటే!
వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన 6వ రోజు వసూళ్లు కాస్త తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగించే విషయంగా మారింది. అయితే ఇటీవల కాలంలో ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలతో పోల్చితే బెటర్‌గానే వసూళ్లు నమోదయ్యాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 6వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే...
వకీల్ సాబ్ 6వ రోజున కలెక్షన్లు
వకీల్ సాబ్ చిత్రం 6వ రోజున ఏపీ, తెలంగాణలో పరిస్థితులను ఎదురించి మంచి వసూళ్లను సాధించింది. నైజాంలో చిత్రం రూ.1.91 కోట్లు, సీడెడ్‌లో రూ.97 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.74 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.29 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.23 లక్షలు, గుంటూరులో రూ.29 లక్షలు, కృష్ణాలో 24 లక్షలు, నెల్లూరులో రూ.16 లక్షలు వసూలు చేసింది.
మొత్తం 6 రోజుల వసూళ్లు
ఇక ఏపీ, తెలంగాణలో మొత్తం వసూళ్ల విషయానికి వస్తే 6 రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ.4.83 కోట్ల నికరంగా, రూ.7.40 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.7 లక్షలు, ఓవర్సీస్లో రూ.4 లక్షలు రాబట్టినట్టు సమాచారం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు రూ.5 కోట్ల నికరంగా, రూ.8 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఏపీ, నైజాంలో మొత్తం కలెక్షన్లు
వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించి మొత్తం 6 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో రూ.22.37 కోట్లు, సీడెడ్‌లో రూ.11.71 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.10.52 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.5.76 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6.39 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.6.47 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.4.41 కోట్లు, నెల్లూరులో రూ.3.06 కోట్లు వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల కలెక్షన్లు
ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు రోజుల కలెక్షన్ల ఇలా ఉన్నాయి. ఏపీ, నైజాంలో కలిపి రూ.65.86 కోట్ల షేర్, రూ.100.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి రూ.3.48 కోట్లు, ఓవర్సీస్లో రూ.3.61 కోట్లు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా రూ.72.95 కోట్లు నికరంగా, రూ.11335 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
వకీల్ సాబ్ లాభాల్లోకి రావాలంటే
వకీల్ సాబ్ చిత్రం రూ.90 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో థియేటర్లో రిలీజైంది. ప్రస్తుతం 6 రోజుల్లో సుమారు రూ.73 కోట్ల మేర చేసింది. అంటే ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.17.05 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.