Vakeel Saab Day 9 collections.. బాక్సాఫీస్ వద్ద వకీల్ సాబ్ ఊగిసలాట.. ఇంకా లోటు ఎంతంటే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ బాక్సాఫీస్ పరుగు నెమ్మదించినట్టు గత రెండు రోజుల కలెక్షన్లు వెల్లడిస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనే అనుమానాల మధ్య ఈ సినిమా వసూళ్ల ప్రయాణం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో 9వ రోజు కలెక్షన్లు ఆసక్తిగా మారాయి. రెండోవారాంతం ఈ సినిమాకు కీలకంగా మారాయి. బాక్సాఫీస్ వద్ద 9వ రోజు కలెక్షన్ల అంచనా ఇలా ఉంది..

ప్రపంచవ్యాప్తంగా బిజినెస్
వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఏపీ, నైజాంలో రూ.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఓవర్సీస్‌లో రూ.5 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.4 కోట్ల మేర బిజినెస్ నమోదైంది. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.90 కోట్ల మేర బిజినెస్ సెట్ అయింది.
కమెడియన్ వివేక్‌కు శ్రద్దాంజలి ఘటించిన సినీ తారలు.. కంటతడి పెట్టిన కీర్తి సురేష్

8 రోజుల తర్వాత లోటు ఎంతంటే
వకీల్ సాబ్ 8 రోజుల బాక్సాఫీస్ జర్నీ తర్వాత రికార్డు వసూళ్లనే నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకుపైగా షేర్.. సుమారు 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. అయితే ఏపీ తెలంగాణలో ఇంకా 6 కోట్లకుపైగా వసూళ్లను, ఓవర్సీస్‌లో 1 .5 కోట్ల వసూళ్లను సాధించాల్సి ఉంది.

అమెరికాలో క్షీణించిన కలెక్షన్లు
కరోనావైరస్ పరిస్థితుల కారణంగా వకీల్ సాబ్ చిత్రం ఓవర్సీస్‌లో బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. ప్రీమియర్‌తోపాటు తొలి వారాంతం తర్వాత దాదాపు 600k కలెక్షన్లను రాబట్టింది. అయితే ఆ తర్వాత 5 రోజుల్లో ఈ చిత్రం 750k డాలర్ల మార్కును దాటలేకపోయింది. దాంతో ఓవరాల్ కలెక్షన్లపై భారీగా దెబ్బ పడింది.

ప్రస్తుతం వారంలో కొత్త సినిమాలు
ఇక ప్రస్తుత వారంలో రిలీజైన తెలుగు సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. రాంగోపాల్ వర్మ దెయ్యం, ఏఆర్ రెహ్మాన్ నిర్మించిన 99 సాంగ్స్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో వకీల్ సాబ్ చిత్రానికి ఉన్నంతలో కొంత ఆదరణ పెరిగిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Recommended Video

9వ రోజున అంచనా ఎంతంటే..
ఇలాంటి పరిస్థితుల్లో వకీల్ సాబ్ రెండో వారాంతంలో మెరుగైన కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రెండో వారాంతంలో శనివారం రోజున ఈ చిత్రం రూ.2 కోట్ల మేర వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











