Vakeel Saab Day 15 collections.. ఇంకా నష్టాల్లోనే పవర్ స్టార్ మూవీ.. కరోనా దెబ్బతో అలా..
లాక్‌డౌన్ తర్వాత దేశ సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లను నమోదు చేసిన వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ప్రయాణాన్ని దాదాపుగా ముగించేసింది. గత కొద్ది రోజులుగా ఈ చిత్రం దారుణమైన వసూళ్లను రాబట్టడంతో ఈ సినిమా పని అయిపోనట్లేనని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో 15వ రోజున వకీల్ సాబ్ సాధించిన గణాంకాలు ఇలా ఉన్నాయి...

15వ రోజున వసూళ్లు అలా..
పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం నైజాంలో రూ.3లక్షలు, సీడెడ్‌లో రూ.1.3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.2 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.2 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ.2 లక్షలు, గుంటూరులో రూ.2 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.2 లక్షలు, నెల్లూరులో రూ.1 లక్షలు వసూలు చేసింది.

15 రోజులు కలెక్షన్లు..
దాంతో వకీల్ సాబ్ 15వ రోజున రూ.15 లక్షల షేర్, రూ.23 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించింది. గత 14 రోజుల్లో సాధించిన వసూళ్లను కలుపుకొంటే ఈ చిత్రం మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 78.41 కోట్ల షేర్, రూ.121 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం రాబడి
తెలుగు రాష్ట్రాల్లో గత 15 రోజుల్లో వకీల్ సాబ్ సాధించిన కలెక్షన్లను కలుపుకొంటే ప్రపంచవ్యాప్తంగా రూ.85.87 కోట్ల షేర్, రూ.137.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో ఈ చిత్రం రూ.3.66 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.8 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించని పరిస్థితిలో ఈ సినిమా ఉంది.

ఎంత మేరకు నష్టమంటే..
వాస్తవానికి వకీల్ సాబ్ చిత్రం సుమారు రూ.95 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 10 కోట్ల లోపు నష్టాలతో ముగిసే అవకాశం కనిపిస్తున్నది. కరోనావైరస్ పరిస్థితుల కారణంగా ఈ చిత్రం స్వల్ప నష్టాలను డిస్టిబ్యూటర్లకు మిగిల్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











