Vakeel Saab విధ్వంసం.. ప్రీమియర్ షోలతోనే కుమ్మేసింది.. ఓవర్సీస్ బాక్సాఫీస్ రిపోర్ట్
వకీల్ సాబ్ విధ్వంసం మొదలైంది. కరోనా విజృంభిస్తున్నా కూడా వకీల్ సాబ్ హవా ముందు ఏదీ నిలబడలేకపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఎక్కడెక్కడున్నారో అక్కడక్కడా వకీల్ సాబ్ తన సత్తా చాటుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా రాత్రి నుంచే షోలు పడ్డాయి. ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలతో వకీల్ సాబ్ దుమ్ములేపుతున్నాడు.

వకీల్ సాబ్ అంచనాలు..
దాదాపు మూడున్నరేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ వస్తున్నాడు.. అభిమానుల అంచనాలు హద్దులు చెరిగిపోయాయ్.. ఆకాశాన్ని కూడా దాటిన హైప్.. ఇలా వాటిని వకీల్ సాబ్ చేరుకుంటుందా? అభిమానులను మెప్పిస్తుందా? అనే అనుమానాలు మొదట్లో ఉండేవి. కానీ ట్రైలర్‌తో అందరిలోనూ నమ్మకం వచ్చింది. ఇక ఇప్పుడు అభిమానులు సంతృప్తి చెందారనే టాక్ వస్తోంది.

ఓవర్సీస్‌లోనూ..
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఓవర్సీస్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. మిగతా సినిమాలు, మిగతా హీరోలు మాత్రం ఆ ఫీట్‌ను సాధించేందుకు నానా కష్టాలు పడుతుంటారు.

ప్రీమియర్స్‌తోనే హల్చల్..
ప్రపంచ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే ప్రీమియర్స్ మొదలయ్యాయి. ట్విట్టర్ మొత్తం వకీల్ సాబ్ హల్చల్ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. అయితే వకీల్ సాబ్ సినిమాతో అభిమానులు ఫుల్ ఖుషీ అని తెలుస్తోంది. ఇక పూర్తి స్థాయి రిపోర్ట్ రావాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

ప్రీమియర్స్ బాక్సాఫీస్ రిపోర్ట్..
ఓవర్సీస్‌లో కేవలం ప్రీమియర్ షోలతోనే 200K డాలర్లను రాబట్టేసింది. అలా వకీల్ సాబ్ మొదటి రోజు ఆటలు ప్రారంభం కాకముందే దుమ్ములేపేశాడు. మొత్తంగా చూసుకుంటే మొదటి రోజే హాఫ్ మిలియన్ డాలర్ల ఫీట్‌ను రాబ్టటి విధ్వంసం సృష్టించేలా ఉన్నాడు.
Recommended Video

మొత్తంగా ఎంతంటే?
రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీర్ రిపోర్ట్ అన్నీ లెక్కలు వేస్తే మొదటి రోజు రికార్డులు బద్దలు అయ్యేలా కనిపిస్తోంది. వకీల్ సాబ్ వంద కోట్ల ఫీట్‌ను దాటేందుకు రెండు మూడు రోజులు చాలన్నట్టుగా వ్యవహారం కనిపిస్తోంది. ఇక మున్ముందు వకీల్ సాబ్ అరాచకం ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











