రికార్డు దిశగా వకీల్ సాబ్ కలెక్షన్లు.. వివాదాలను ఎదురించిన పవన్ కల్యాణ్ మూవీ.. ఏపీ, నైజాంలో ఎంతంటే
వకీల్ సాబ్ టికెట్ల రేట్లు పెంపు వ్యవహారం ఓ వైపు కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లోని వసూళ్ల లెక్కింపులో జాప్యం జరిగింది. దాంతో వివిధ ఏరియాలో టికెట్ రేట్లు ఒక్కో విధంగా ఉన్నాయి. ఏపీలో ఒక రకంగా, తెలంగాణలో మరో రకంగా ఉండటం గందరగోళం ఏర్పడింది. అయితే ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో కలెక్షన్ల వివరాలు అందుబాటులోకి వచ్చాయి. అవి ఏమిటంటే..

ఖమ్మం జిల్లాలో
ఖమ్మం జిల్లాలో తొలి రోజున 25 షోలు ప్రదర్శించగా అన్ని షోలు హౌస్‌ఫుల్ కలెక్షన్లను నమోదు చేశాయి. ఖమ్మం టౌన్ విషయానికి వస్తే వకీల్ సాబ్ ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. మొదటి రోజున ఈ చిత్రం రికార్డు స్థాయిలో రూ.30 లక్షలకుపైగా వసూళ్లను రాబట్టింది.

సీడెడ్‌లో రికార్డు దిశగా
తాజా వివరాల ప్రకారం వకీల్ సాబ్ చిత్రం సీడెడ్‌లో భారీగా వసూళ్లను నమోదు చేసింది. బళ్లారిని మినహాయిస్తే ఈ చిత్రం రూ.4.2 కోట్ల షేర్ రాబట్టింది. సీడెడ్‌లో పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించి ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు. అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

కృష్ణ జిల్లాలో
కృష్ణా జిల్లా విషయానికి వస్తే వకీల్ సాబ్ చిత్రం తొలి రోజున గ్రాండ్‌గా కలెక్షన్లను రాబట్టింది. తొలి రోజున ఈ చిత్రం రూ.1.90 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. జీఎస్టీ, ఇతర పన్నులు మినహాయించిన తర్వాత ఈ చిత్రం రూ.1.56 కోట్లుగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు లెక్క కట్టాయి.

గోదావరి జిల్లాలో భారీగా
గోదావరి జిల్లాలో వకీల్ సాబ్ చిత్రం భారీగా ఓపెనింగ్స్ నమోదు చేసింది. తొలి రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.3.10 కోట్ల వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.3.10 కోట్లు వసూలు చేసింది. అలాగే ఉత్తరాంధ్రలో ఈ చిత్రం రూ.3.8 కోట్లు రాబట్టింది.

నైజాంలో వకీల్ సాబ్ హవా
ఇక నైజాంలో వకీల్ సాబ్ చిత్రం భారీగా వసూళ్లను నమోదు చేసింది. తాజా అంచనాల ప్రకారం ఈ చిత్రం రూ.10 కోట్లకుపైగా ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తున్నది. పవన్ కల్యాణ్ మూవీకి సంబంధించి ఈ చిత్రం అద్బుతమైన ఓపెనింగ్స్ అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Recommended Video

ఓవర్సీస్‌లో ప్రభంజనం
ఓవర్సీస్‌లో వకీల్ సాబ్ ప్రభంజనం భారీగా కనిపించింది. ఈ చిత్రం తొలి రోజున 400k డాలర్లను వసూలు చేసింది. ప్రీమియర్లతో కలుపుకొంటే 730k డాలర్లను రాబట్టింది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.5.5 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











