యూఎస్ ప్రీమియర్ షోలతో మరో రికార్డు అందుకున్న వకీల్ సాబ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మొత్తానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ ను అందుకుంది. దాదాపు మూడేళ్ళ అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ సాలీడ్ కలెక్షన్స్ తో తన సత్తా చాటుతున్నారు. మొదటి రోజు దాదాపు అన్ని ఏరియాల్లో హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమివ్వడంతో ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకునేలా ఉన్నట్లు టాక్ వస్తోంది.
అందంతో ఆకట్టుకొంటున్న సోని చరిష్టా.. ఎద అందాలతో యువ హీరోయిన్ రచ్చ
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే. ఇక అమెరికాలో కూడా సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. ఇదివరకే ఎన్నారైలు పింక్ సినిమా చూసినప్పటికి వకీల్ సాబ్ కు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందండం విశేషం. లాక్ డౌన్ అనంతరం ప్రీమియర్స్ ద్వారా జాతిరత్నాలు 130K డాలర్లు అందుకొని టాప్ లో కొనసాగుతూ వచ్చింది. ఇక వకీల్ సాబ్ మాత్రమే అంతకుమించి అనేలా రికార్డును బ్రేక్ చేసింది.

మొత్తం ప్రీమియర్స్ ముగిసేసరికి సినిమా 300k డాలర్లు అందుకున్నట్లు సమాచారం. కోవిడ్ ఎఫెక్ట్ లేకపోయి ఉంటే కలెక్షన్స్ మరో రేంజ్ లో ఉండేవి. ఇక ఈజీగా 1 మిలియన్ మార్క్ ను అందుకోగలదని చెప్పవచ్చు. వకీల్ సాబ్ వీకెండ్ బూకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. శని ఆదివారాలు కలెక్షన్స్ మరింత పెరగవచ్చు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా ఏ స్థాయిలో లాభాలను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











