Valimai Day 1 అజిత్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసిందంటే..
సౌత్ సూపర్ స్టార్, తలా అజిత్ కుమార్, దర్శకుడు హెచ్ వినోద్ కాంబినేషన్‌లో రూపొందిన వలిమై సినిమా ఫ్రిబ్రవరి 24 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాత బోని కపూర్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజైంది. కార్తీకేయ గుమ్మకొండ, బాలీవుడ్ హీరోయిన్ హ్యుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు భారీ స్పందన కనిపించింది. అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే..

వలిమై ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా..
వలిమై సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే నమోదైంది. కేవలం తమిళనాడుకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ 64.50 కోట్లకు అమ్ముడుపోగా, ఇండియా వ్యాప్తంగా 76 కోట్ల బిజినెస్ నమోదు చేసింది. ఓవర్సీస్ రైట్స్ 20 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది.

తమిళనాడులో 650 థియేటర్లకుపైగా
వలిమై సినిమాకు ప్రేక్షకుల నుంచి డిమాండ్ భారీగా ఉండటంతో తమిళనాడులో రికార్డుస్థాయిలో థియేటర్లలో రిలీజైంది. కేవలం తమిళ రాష్ట్రంలోనే 650పైగా థియేటర్లలో రిలీజైంది. మల్టీప్లెక్స్‌లో పలు రకాల షోలు ప్రదర్శించారు. ఈ సినిమా ప్రత్యేక షోలకు, రెగ్యులర్ షోలకు భారీ స్పందన లభించింది. రిలీజైన ప్రతీ ప్రాంతంలో థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి.

100 శాతం అక్యుపెన్సీ
వలిమై సినిమాకు రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. తమిళనాడులో రిలీజైన ప్రతీచోట 100 శాతం అక్యుపెన్సీ కనిపించింది. తొలి ఆట తర్వాత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదు. సాయంత్రానికికల్లా అజిత్ ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ టాక్‌ను, సాధారణ ప్రేక్షకలు నుంచి యావరేజ్ రిపోర్ట్‌ను ప్రచారం చేశారు. దాంతో కలెక్షన్లపై కొంత ప్రభావం పడింది.

తొలి రోజు కలెక్షన్ల అంచనా
వలిమై తొలి రోజు కలెక్షన్ల అంచనాకు వస్తే.. తమిళనాడులోనే ఈ చిత్రం సుమారు 35 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం కనిపిస్తున్నది. ఇక తెలుగు రాష్ట్రాల్లోను, అలాగే మిగితా రాష్ట్రాల్లో మరో 10 కోట్లకుపైగా వసూళ్ల అంచనాను ట్రేడ్ వర్గాలు వేశాయి. దాంతో ఈ సినిమా సుమారుగా 45 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











