Valimai ప్రీ రిలీజ్ బిజినెస్.. సౌత్ ఇండస్ట్రీలోనే రికార్డు.. భారీగా అజిత్, పవన్ బాక్సాఫీస్ ఫైట్
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన వలిమై చిత్రం రికార్డుస్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్‌ను సొంతం చేసుకోవడం దక్షిణాది సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. కరోనావైరస్ కారణంగా పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఫిబ్రవరి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు, ఇతర వివరాల్లొకి వెళితే..

తమిళనాడులో ఆంక్షలు సడలించడంతో
తమిళనాడులో ప్రభుత్వం కరోనా ఆంక్షలు, కర్ఫ్యూలు ఎత్తివేయడం సినీ పరిశ్రమకు సానుకూలంగా మారింది. 100 శాతం అక్యుపెన్సీకి అనుమతి ఇవ్వడంతో భారీ బడ్జెట్ చిత్రాలు, అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కోసం క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే వలిమై చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు నిర్మాత బోని కపూర్ ప్లాన్ చేశారు.

అజిత్ మూవీకి భారీ రెస్సాన్స్
తమిళనాడులో చాలా నెలల తర్వాత సూపర్ స్టార్ అజిత్ నటించిన వలిమై వస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో స్పెషల్ స్క్రీనింగ్స్‌కు మంచి రెస్సాన్స్ వస్తున్నది. ఈ క్రమంలో రికార్డుస్థాయిలో థియేటర్లలో వలిమై సినిమాను రిలీజ్ చేయానికి ప్లాన్ చేస్తున్నారు

తమిళ, తెలుగు హక్కుల రేట్ ఇలా
వలిమై సినిమాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులో థియేట్రికల్ రైట్స్ జీఎస్టీతోపాటు 72 కోట్ల రూపాయలకు అమ్మడం జరిగింది. ఇక కేరళలో థియేట్రికల్ హక్కులు రూ.3.5 కోట్ల రూపాయలు, కర్ణాటక హక్కులు 5.5 కోట్లు, తెలుగు హక్కులు 5 కోట్లకుపైగానే, అలాగే హిందీ హక్కులు 7 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

ఓవరాల్‌గా 300 కోట్ల బిజినెస్
ఇక థియేట్రికల్ కాకుండా వలిమై ఇతర హక్కులకు కూడా భారీ ధర పలికినట్టు సమాచారం. వలిమై ఆడియో రైట్స్ 4.5 కోట్లు, శాటిలైట్ రైట్స్ 65 కోట్ల రూపాయలు, అలాగే డిజిటల్ ఓటీటీ రైట్స్ మొత్తం కలిపి సుమారు 300 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలిసింది.

పవన్ కల్యాణ్ Vs అజిత్ కుమార్
ఇదిలా ఉండగా, దక్షిణాది సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్, అజిత్ కుమార్ లాంటి ఇద్దరు అగ్ర హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. వాలిమై చిత్రం ఫిబ్రవరి 24న రిలీజ్ అవుతుంటే.. పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. దీంతో దక్షిణాది సినీ పరిశ్రమలో పండుగ వాతావరణం నెలకొన్నది.
Recommended Video

వలిమైలో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: అజిత్ కుమార్, కార్తీకేయ, హ్యూమా ఖురేషి, యోగి బాబు, చిత్రా రెడ్డి తదితరులు
నిర్మాత: బోని కపూర్
దర్శకత్వం: హెచ్ వినోద్
సినిమాటోగ్రఫి: నిరవ్ షా
ఎడిటింగ్: విజయ్ వెల్లుకుట్టి
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
బ్యానర్: బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2022-02-24
బడ్జెట్: 150 కోట్లు


Click it and Unblock the Notifications











