షాకింగ్‌గా వాల్మీకి 6 రోజుల కలెక్షన్లు: నష్టాలను తగ్గించుకోవాలంటే.. ఇంకా ఎంతంటే

Recommended Video

Gaddala Konda Ganesh Collections || Valmiki Collections

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో విడుదలైన వాల్మీకి (గద్దల కొండ గణేష్) హిట్ దిశగా పరుగులు పెడుతున్నది. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్‌తోపాటు చిత్ర యూనిట్ అంతా ఆంధ్రాలో విజయయాత్రను నిర్వహిస్తున్నది. ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుండటంతో వాల్మీకి యూనిట్ మరింత ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో ఈ చిత్రం గత ఆరు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..

 6వ రోజు కలెక్షన్లు ఇలా

6వ రోజు కలెక్షన్లు ఇలా

తెలుగు రాష్ట్రాల్లో వాల్మీకి చిత్రం మంచి వసూళ్లను సాధిస్తున్నది. నైజాంలో ఈ చిత్రం ఆరో రోజున 38 లక్షల రూపాయలను వసూలు చేసింది. సీడెడ్‌లో రూ.18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.8.4 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.6.2 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.4.9 లక్షలు, గుంటూరులో రూ.4.51 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.3.8 లక్షలు, నెల్లూరులో రూ.3.75 లక్షలు రాబట్టింది. దాంతో ఆరో రోజున బాక్సాఫీస్ ఖాతాలో రూ.88 లక్షలు జమ చేసింది.

మొత్తం 6 రోజుల వసూళ్లు

మొత్తం 6 రోజుల వసూళ్లు

ఇక మొత్తంగా వాల్మీకి చిత్రం ఏపీ, తెలంగాణలో ఆరు రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే నైజాంలో రూ.6.44 కోట్లు, సీడెడ్‌లో రూ.2.78 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.07 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.35 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.18 కోట్లు, గుంటూరులో రూ.1.48 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.15 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.66 లక్షలు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

ఏపీ, తెలంగాణలో వాల్మీకి మొత్తం రూ.17.11 కోట్లు వసూలు చేయగా, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.1.28 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో రూ.1.37 కోట్లుతో కలిపి మొత్తంగా 31.65 కోట్లు గ్రాస్, రూ.19.76 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా లాభాల్లోకి రావాలంటే.. 5.24 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుంది. ఈ వారం వాల్మీకికి పోటి లేదు కాబట్టి స్లో అయినా ఆ టార్గెట్ ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

 వాల్మీకి ప్రీ రిలీజ్ బిజినెస్

వాల్మీకి ప్రీ రిలీజ్ బిజినెస్

ఇక వాల్మీకి ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం హక్కులు రూ.7.4 కోట్లు, సీడెడ్ రూ.3.35 కోట్లు, ఆంధ్రా రూ.9 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి మొత్తం రూ.19.75 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు రూ.1.50 కోట్లు, ఓవర్సీస్ రూ.3 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రూ.24.25 కోట్లుగా జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X