Don't Miss!
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
వాల్మీకి కలెక్షన్ల జోరు.. దుమ్మ దులిపేస్తున్న గద్దలకొండ గణేష్
వరుస విజయాలతో దూసుకెళ్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా గద్దలకొండ గణేష్ (వాల్మీకి) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తమిళ చిత్రం జిగర్తాండ సినిమాకు రీమేక్‌గా రూపొందింది. పూజా హెగ్డే, తమిళ నటుడు అధర్వ, కమెడియన్లు సత్య, రచ్చరవి తదితరులు కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 20 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..
తెలుగు రాష్ట్రాల్లో
గద్దలకొండ గణేష్ (వాల్మీకి) చిత్రం తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజున రూ.5.83 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్లో కలుపుకొని రూ.6.81 కోట్ల షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఏపీ, తెలంగాణలో
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా చూసుకొంటే నైజాంలో ఈ చిత్రం రూ.1.63 కోట్లు, సీడెడ్ రూ.0.82 కోట్లు, వైజాగ్‌లో రూ.0.69 లక్షలు, గుంటూరులో రూ.0.71 లక్షలు, తూర్పు రూ.0.48 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.0.58 లక్షలు, కృష్ణా రూ.0.42 లక్షలు, నెల్లూరులో రూ.16 లక్షలు వసూలు చేసింది.
రెండో రోజు వసూళ్లు
ఇక రెండో రోజు ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. రెండో రోజు అర్బన్‌లో 25 శాతానికి పైగా కలెక్షన్లు క్షీణించాయని, మాస్ ఏరియాలో 20 శాతానికి పైగా పడిపోయినా వసూళ్లలతో పెద్దగా తగ్గుదల ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. రెండో రోజు రూ.3 కోట్ల షేర్ సాధించడానికి అవకాశముందని పేర్కొంటున్నారు. దాంతో సుమారు 10 కోట్లకు చేరువగా వసూళ్లు ఉండే అవకాశం ఉంది.
లాభాల్లోకి రావాలంటే
ఇక వాల్మీకి సినిమా ప్రీ రిలీజ్ భారీగానే జరిగింది. హరీష్ శంకర్ టేకింగ్, వరుణ్ తేజ్ లుక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.24.25 కోట్లు బిజినెస్ చేసింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 25 కోట్లకుపైగా షేర్ సాధించాల్సి ఉంటుంది.