twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాల్మీకి కలెక్షన్ల జోరు.. దుమ్మ దులిపేస్తున్న గద్దలకొండ గణేష్

    |

    వరుస విజయాలతో దూసుకెళ్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా గద్దలకొండ గణేష్ (వాల్మీకి) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తమిళ చిత్రం జిగర్తాండ సినిమాకు రీమేక్‌గా రూపొందింది. పూజా హెగ్డే, తమిళ నటుడు అధర్వ, కమెడియన్లు సత్య, రచ్చరవి తదితరులు కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 20 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

     తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల్లో

    గద్దలకొండ గణేష్ (వాల్మీకి) చిత్రం తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజున రూ.5.83 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో కలుపుకొని రూ.6.81 కోట్ల షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

    ఏపీ, తెలంగాణలో

    ఏపీ, తెలంగాణలో

    తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా చూసుకొంటే నైజాంలో ఈ చిత్రం రూ.1.63 కోట్లు, సీడెడ్ రూ.0.82 కోట్లు, వైజాగ్‌లో రూ.0.69 లక్షలు, గుంటూరులో రూ.0.71 లక్షలు, తూర్పు రూ.0.48 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.0.58 లక్షలు, కృష్ణా రూ.0.42 లక్షలు, నెల్లూరులో రూ.16 లక్షలు వసూలు చేసింది.

    రెండో రోజు వసూళ్లు

    రెండో రోజు వసూళ్లు

    ఇక రెండో రోజు ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. రెండో రోజు అర్బన్‌లో 25 శాతానికి పైగా కలెక్షన్లు క్షీణించాయని, మాస్ ఏరియాలో 20 శాతానికి పైగా పడిపోయినా వసూళ్లలతో పెద్దగా తగ్గుదల ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. రెండో రోజు రూ.3 కోట్ల షేర్ సాధించడానికి అవకాశముందని పేర్కొంటున్నారు. దాంతో సుమారు 10 కోట్లకు చేరువగా వసూళ్లు ఉండే అవకాశం ఉంది.

    లాభాల్లోకి రావాలంటే

    లాభాల్లోకి రావాలంటే

    ఇక వాల్మీకి సినిమా ప్రీ రిలీజ్‌ భారీగానే జరిగింది. హరీష్ శంకర్ టేకింగ్, వరుణ్ తేజ్ లుక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.24.25 కోట్లు బిజినెస్ చేసింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 25 కోట్లకుపైగా షేర్ సాధించాల్సి ఉంటుంది.

    English summary
    Varun Tej and Harish Shankar's Valmiki released worldwide on September 13th. Produced on the 14 Reels Plus banner by Ram and Gopi Achanta, the film also stars Tamil actor Atharvaa Murali in a key role. Pooja Hegde and Mrunalini Ravi are the female leads. This movie collected 6 crores above world wide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X