twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాల్మీకి క్లోజింగ్ కలెక్షన్లు: బాక్సాఫీస్‌పై గద్దలకొండ పంజా.. ఎంత లాభం వచ్చిందంటే

    |

    Recommended Video

    Gaddalakonda Ganesh Worldwide Closing Collections || బాక్సాఫీస్‌పై గద్దలకొండ పంజా

    తమిళంలో విజయం సాధించిన జిగర్తాండ మూవీ రీమేక్‌గా రిలీజైన వాల్మికీ (గద్దలకొండ గణేష్) చిత్రం భారీ అంచనాలతో రిలీజైంది. ఈ చిత్రం అంచనాలకు తగినట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా డిస్టిబ్యూటర్లకు మంచి లాభాలు పంచిన చిత్రంగా నిలిచింది. 2019లో రిలీజైన తెలుగు చిత్రాల్లో లాభాలు ఆర్జించిన ఓ సినిమాగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. వాల్మికీ సినిమా ఫైనల్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

    గద్దలకొండ ప్రీ రిలీజ్ బిజినెస్

    గద్దలకొండ ప్రీ రిలీజ్ బిజినెస్

    వాల్మీకి మూవీ టీజర్లు, ట్రైలర్లకు మంచి స్పందన రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ వరుణ్ తేజ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్‌గా జరిగింది. నైజాం హక్కులు రూ.7.4 కోట్లు, సీడెడ్ రూ.3.35 కోట్లు, ఆంధ్రా రూ.9 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి మొత్తం రూ.19.75 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు రూ.1.50 కోట్లు, ఓవర్సీస్ రూ.3 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రూ.24.25 కోట్లుగా జరిగింది.

    నైజాం, సీడెడ్‌లో

    నైజాం, సీడెడ్‌లో

    నైజంలో సూపర్‌గా వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా ఈ చిత్రం రూ.8.74 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. డిస్టిబ్యూటర్లకు సుమారు రూ.1.5‌కు పైగానే వసూళ్లను రాబట్టింది. ఇక సీడెడ్‌లో రూ.3.45 కోట్లతో దాదాపు 10 లక్షల షేర్‌ను అందించింది. ఇక ఆంధ్రా విసయానికి వస్తే సుమారు 12 కోట్ల రూపాయల షేర్‌ను సాధించి దాదాపు 2 కోట్లకుపైగానే లాభాలను పంచింది.

    ఆంధ్రాలో ఏరియాల వారిగా

    ఆంధ్రాలో ఏరియాల వారిగా

    ఆంధ్రాలో నెల్లూరులో రూ.89 లక్షల షేర్, కృష్ణ రూ.1.42 కోట్లు, గుంటూరు రూ.1.42 కోట్లు, వైజాగ్ రూ.2.66 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.1.61 కోట్లు, వెస్ట్ గోదావరి రూ.1.51 కోట్లు వసూలు చేసింది. ఇక కర్ణాటకలోనే ఏకంగా రూ.1.51 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.63 లక్షల వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో రూ.1.08 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా

    ఇలా వాల్మికీ (గద్దలకొండ గణేష్) ప్రపంచవ్యాప్తంగా మంచి ఫలితాలను రాబట్టింది. ఈ చిత్రం రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక నికరంగా చూస్తే రూ.25.15 కోట్ల షేర్ సాధించింది. దాంతో అన్ని ఏరియాలోని డిస్టిబ్యూటర్లందరూ లాభాల పట్టారు. వరుణ్ తేజ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను రుజువు చేసుకొన్నారు. వరుస విజయాలనే కాకుండా ప్రతిభతోనూ ఆకట్టుకోవడంతో ఇండస్ట్రీలో గ్యారెంటీ హీరో అనే టాక్‌ను సొంతం చేసుకొన్నారు.

    English summary
    Varun Tej and Harish Shankar's Valmiki released worldwide on September 13th. Produced on the 14 Reels Plus banner by Ram and Gopi Achanta, the film also stars Tamil actor Atharvaa Murali in a key role. Pooja Hegde and Mrunalini Ravi are the female leads. This movie collected 25.14 crores share and 45 crores gross world wide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X