Vanda Devullu Closing Collections: వంద దేవుళ్లు క్లోజింగ్ కలెక్షన్లు.. విజయ్ ఆంటోనికి లాభమా? నష్టమా?
తమిళ స్టార్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని అతిథి పాత్రలో కనిపించిన చిత్రం వంద దేవుళ్లు (తమిళంలో నూరు సామి). ఈ చిత్రంలో స్వాసిక విజయ్, అజయ్ దిశాన్, లిజోమోల్ జోస్ కీలక పాత్రల్లో నటించారు. కరుణాస్, బాలాజీ శక్తివేల్, కావ్య అనిల్, అరుల్ దాస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు బిచ్చగాడు ఫేమ్ శశి దర్శకత్వం వహించారు. విజయ్ ఆంటోని నిర్మాతగా వ్యవహరించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్: బాలాజీ శ్రీరామ్, సినిమాటోగ్రఫి: ఎస్‌బీ దర్శన్ కిర్లోష్, ఎడిటర్: హరీష్ యువరాజ్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన తెలుగు, కన్నడ, తమిళ రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

తల్లి కొడుకుల అనుబంధాలు, కన్నతల్లికి రెండో పెళ్లి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన మదర్ సెంటిమెంట్‌ను పూర్తిగా గ్రామీణ వాతావరణంలో రస్డిక్ రూరల్ డ్రామాగా రూపొందించారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులనీ కలుపుకొని ఈ సినిమాను సుమారుగా 12 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా విజయ్ ఆంటోని, శశి కాంబినేషన్ కావడంతో అంచనాలు భారీగా పెరిగి భారీగా బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియట్రికల్ బిజినెస్ సుమారుగా 10 కోట్ల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 11 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
ఇక ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో భారీగా రిలీజైంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా తొలి రోజు 70 లక్ష్లలు నెట్, రెండో రోజు 1.25 కోట్ల నెట్, మూడో రోజు 1.68 కోట్ల నెట్, నాలుగో రోజు 70 లక్షల నెట్, ఐదో రోజు 60 లక్షల నెట్, ఆరో రోజు 50 లక్షల నెట్, ఏడో రోజు 50 లక్షల నెట్, ఎనిమిదో రోజు 60 లక్షల నెట్, తొమ్మిదో రోజు 60 లక్షలు,
పదో రోజు 65 లక్షల నెట్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం టోటల్‌గా 7.5 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను, అలాగే 10.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తమిళంలో నూరు స్వామి, తెలుగులో వంద దేవుళ్లుగా రిలీజైన ఈ చిత్రం ఓవర్సీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమాకు ఇతర సినిమాల నుంచి భారీగా పోటీ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 1.5 కోట్ల రూపాయలు రాబట్టింది అని సాక్ నిక్ వెల్లడించింది. దాంతో ఈ చిత్రం 9 కోట్ల రూపాయల నెట్, 12 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక ఈ చిత్రం నాన్ థియేట్రికల్ ద్వారా భారీగానే రాబట్టింది. బడ్జెట్‌తో పోల్చితే ఈ చిత్రం ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్‌కు సాధించింది. థియేట్రికల్‌గా భారీ నష్టాలతో ముగిసింది అని ట్రేడ్ వర్గాల రిపోర్ట్.


Click it and Unblock the Notifications