Vanda Devullu Day 1 Collections: వంద దేవుళ్లు బాక్సాఫీస్ కలెక్షన్స్.. విజయ్ ఆంటోనీ మూవీకి తొలిరోజు ఎంతంటే?

సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత నటుడిగానూ సత్తా చాటారు. బిచ్చగాడు, నకిలీ, బేతాళుడు, కిల్లర్, భద్రకాళి సినిమాలతో తెలుగునాట మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తాజాగా విజయ్ ఆంటోనీ నటించిన మూవీ నూరు సామి.. తెలుగులో వంద దేవుళ్లు పేరుతో జూన్ 19న విడుదలైంది. ఈ నేపథ్యంలో వంద దేవుళ్లు మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

వంద దేవుళ్లు తారాగణం
శర్వంత్ రామ్ క్రియేషన్స్, రామాంజనేయులు జవ్వాజి క్రియేషన్స్, విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ సంస్థలు వంద దేవుళ్లు సినిమాను నిర్మించాయి. ఈ మూవీలో శ్వాసిక హీరోయిన్‌గా నటించారు. అజయ్ దిశాన్, లిజిమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్, బాలాజీ శక్తివేల్, అరుల్‌దాస్, మున్షికాంత్, పడిని కుమార్, జెన్సన్ దివాకర్, బక్స్, వినోదిని, తమరై, కొడంగి వడివేలు తదితరులు కీలకపాత్రలు పోషించగా శశి దర్శకత్వం వహించారు. ఎస్‌బీ దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రాఫర్‌గా, హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకత్వం వహించారు.

Vanda Devullu Day 1 Expected Box Office Collections Worldwide Vijay Antony s film Opening day Report

వంద దేవుళ్లు బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి వంద దేవుళ్లు మూవీకి 10 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బిచ్చగాడు మూవీ తర్వాత శశి దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నటించిన సినిమా కావడంతో పాటు టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో వంద దేవుళ్లపై హైప్ నెలకొంది. దానికి తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.

వంద దేవుళ్లు బుకింగ్
విజయ్ ఆంటోనీ మూవీకి తొలిరోజు అనుకున్న స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్ధితి నెలకొంది. సమంత మా ఇంటి బంగారం, పెద్ది తదితర సినిమాల నుంచి వంద దేవుళ్లు మూవీ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. తొలిరోజు సాయంత్రం 4 గంటల వరకు విజయ్ ఆంటోనీ మూవీకి ఇండియా వైడ్‌గా 642 షోలు ప్రదర్శితమై.. 13 శాతం ఆక్యూపెన్సీ మాత్రమే సాధించినట్లు సాక్‌నిక్ నివేదించింది.

వంద దేవుళ్లు తొలిరోజు వసూళ్లు అంచనా
ఇప్పటి వరకు చెన్నైలో 216 షోలు, బెంగళూరులో 98 షోలు, కోయంబత్తూరులో 97 షోలు, మధురైలో 78 షోలు చొప్పున ప్రదర్శితమైనట్లు తెలిపింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు విజయ్ ఆంటోనీ మూవీకి ఇండియాలో కేవలం 21 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది. తొలిరోజు వంద దేవుళ్లు సినిమాకు తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు సహా వరల్డ్ వైడ్‌గా కోటి రూపాయల రేంజ్‌‌లో ఓపెనింగ్స్ రావచ్చని భావిస్తున్నారు. ప్రధానంగా వీకెండ్‌పైనే విజయ్ ఆంటోనీ, చిత్ర యూనిట్ ఆశలు పెట్టుకున్నారు. కుటుంబ ప్రేక్షకులు, రూరల్ ఏరియాలకు ఈ సినిమా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. వీకెండ్ గడిస్తేనే కానీ వంద దేవుళ్లు సినిమా పరిస్ధితిపై ఓ క్లారిటీ రానుంది. మరి విజయ్ ఆంటోనీ ఈసారైనా హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X