Vanda Devullu Day 2 Collections: వంద దేవుళ్లు మూవీకి భారీ దెబ్బ.. విజయ్ ఆంటోనీ సినిమాకి రెండో రోజు ఎంతంటే?

శశి దర్శకత్వంలో కోలీవుడ్ హీరో కమ్ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ నటించిన మూవీ నూరు సామి.. తెలుగులో వంద దేవుళ్లు పేరుతో జూన్ 19న విడుదలైంది. శర్వంత్ రామ్ క్రియేషన్స్, రామాంజనేయులు జవ్వాజి క్రియేషన్స్, విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ సంస్థలు వంద దేవుళ్లు సినిమాను నిర్మించాయి. ఈ మూవీలో శ్వాసిక హీరోయిన్‌గా నటించారు. అజయ్ దిశాన్, లిజిమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్, బాలాజీ శక్తివేల్, అరుల్‌దాస్, మున్షికాంత్, పడిని కుమార్, జెన్సన్ దివాకర్, బక్స్, వినోదిని, తమరై, కొడంగి వడివేలు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఎస్‌బీ దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రాఫర్‌గా, హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో వంద దేవుళ్లు మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా రెండో రోజు ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

Vanda Devullu Day 2 Expected Box Office Collections Worldwide Vijay Antony s film faces heavy drop

వంద దేవుళ్లు బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి వంద దేవుళ్లు మూవీకి 10 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ ఆంటోనీ క్రేజ్, టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో వంద దేవుళ్లపై హైప్ నెలకొంది. దానికి తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా కోలీవుడ్ టాక్.

వంద దేవుళ్లు తొలిరోజు కలెక్షన్స్
విజయ్ ఆంటోనీ మూవీ తొలిరోజు వసూళ్ల పరంగా నిరాశపరిచింది. విజయ్ సొంత రాష్ట్రంతో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం వంద దేవుళ్లు మూవీకి తమిళనాడులో 1.15 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 7 లక్షల రూపాలు, రెస్టాఫ్ ఇండియాలో 3 లక్షల రూపాయలు చొప్పున ఇండియాలో 1.25 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టగలిగింది.

గత కొంతకాలంగా తమిళ సినిమాలు ఓవర్సీస్‌లో మంచి రిజల్ట్స్ చూపిస్తున్నాయి. అయితే నూరుసామికి అక్కడ కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నార్త్ అమెరికాతో పాటు సింగపూర్, మలేషియా తదితర ప్రాంతాల్లోనూ విజయ్ ఆంటోనీ మూవీకి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. నూరుసామి మూవీకి ఓవర్సీస్‌లో తొలిరోజు కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే వచ్చినట్లుగా సోషల్ మీడియా టాక్. దాంతో ఓవరాల్‌గా తొలిరోజు విజయ్ ఆంటోనీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 1.50 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చింది.

వంద దేవుళ్లు రెండో రోజు వసూళ్ల అంచనా
వంద దేవుళ్లు మూవీకి మిక్స్‌డ్ టాక్‌కి తోడు మా ఇంటి బంగారం, కాక్‌టెయిల్ 2, కరుప్పు, పెద్ది తదితర సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దాంతో రెండో రోజుకే వసూళ్లు దారుణంగా పడిపోయాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు విజయ్ ఆంటోనీ మూవీకి ఇండియాలో 489 షోలు ప్రదర్శితమై.. కేవలం 14 శాతం మాత్రమే ఓవరాల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ వెల్లడించింది. ఇప్పటి వరకు రెండో రోజు ఇండియా వైడ్‌గా 16 లక్షల రూపాయల నికర వసూళ్లు మాత్రమే రాబట్టినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. శనివారం వంద దేవుళ్లు మూవీ వరల్డ్ వైడ్‌గా 75 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల రేంజ్‌లో కలెక్షన్స్ రాబట్టని వచ్చని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X