Vanda Devullu Day 3 Collections: వంద దేవుళ్లు కలెక్షన్స్... విజయ్ ఆంటోనీ మూవీకి మూడో రోజు ఎంతంటే?

కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ నూరు స్వామి.. తెలుగులో వంద దేవుళ్లు పేరుతో విడుదలైంది. రూరల్ బ్రాక్‌డ్రాప్, తల్లీకొడుకుల అనుబంధాల చుట్టూ తిరిగే ఈ కథలో శ్వాసిక హీరోయిన్‌గా నటించగా.. బిచ్చగాడు ఫేమ్ శశి దర్శకత్వం వహించారు. శర్వంత్ రామ్ క్రియేషన్స్, రామాంజనేయులు జవ్వాజి క్రియేషన్స్, విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ సంస్థలు వంద దేవుళ్లు సినిమాను నిర్మించాయి.

అజయ్ దిశాన్, లిజిమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్, బాలాజీ శక్తివేల్, అరుల్‌దాస్, మున్షికాంత్, పడిని కుమార్, జెన్సన్ దివాకర్, బక్స్, వినోదిని, తమరై, కొడంగి వడివేలు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఎస్‌బీ దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రాఫర్‌గా, హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకత్వం వహించారు. జూన్ 19న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో వంద దేవుళ్లు మూవీ బడ్జెట్ ఎంత? మూడో రోజు ఎంత వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..

Vanda Devullu Day 3 Expected Box Office Collections Worldwide Vijay Antony s film get decent number

వంద దేవుళ్లు రెండు రోజుల కలెక్షన్స్
వంద దేవుళ్లు మూవీని 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలిరోజున ఈ సినిమా ఇండియాలో 75 లక్షల రూపాయలు వసూలు చేయగా.. రెండో రోజున 1.22 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇండియాలో ఇప్పటి వరకు 1.97 కోట్ల రూపాయల నెట్.. 2.88 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు తమిళనాడు 2.68 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 14 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 6 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది.

వంద దేవుళ్లు ఓవర్సీస్ కలెక్షన్స్
అయితే ఓవర్సీస్‌ మార్కెట్ విజయ్ ఆంటోనీ మూవీని తీవ్రంగా నిరాశపరిచింది. నార్త్ అమెరికా, సింగపూర్, మలేషియా సహా ఎక్కడా ఈ సినిమా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటి వరకు విదేశాల్లో వంద దేవుళ్లు మూవీ 20 లక్షల రూపాయలు రాబట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు ఈ సినిమా 3 కోట్ల రూపాయల మార్క్ చేరుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

వంద దేవుళ్లు మూడో రోజు వసూళ్ల అంచనా
విజయ్ ఆంటోనీ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద పెద్ది, మా ఇంటి బంగారంతో పాటు చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. రూరల్, పట్ణణ ప్రాంతాల్లోనే వంద దేవుళ్లు మూవీకి కాస్తో కూస్తో రెస్పాన్స్ వస్తుండగా.. మల్టీప్లెక్స్‌ జనాలకు ఇంకా ఎక్కడం లేదు. ఆదివారంతో వీకెండ్ ముగియనుండటంతో ఈ సినిమా ఈ ఒక్కరోజులోనూ మ్యాగ్జిమమ్ రాబట్టుకోవాల్సి ఉంది.

వంద దేవుళ్లు మూవీకి మూడో రోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఇండియాలో 464 షోలు ప్రదర్శితమై 16 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ పేర్కొంది. ఇప్పటి వరకు ఇండియాలో విజయ్ ఆంటోనీ మూవీకి 26 లక్షల రూపాయలు వసూలైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మూడో రోజున విజయ్ ఆంటోనీ మూవీ తమిళనాడులో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయల చొప్పున 1.50 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరి వీకెండ్ ముగిసేనాటికి విజయ్ ఆంటోనీ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X