Vanda Devullu Day 4 Collections: విజయ్ ఆంటోనీకి మండే టెస్ట్.. వంద దేవుళ్లు మూవీకి నాలుగో రోజు ఎంతంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ, శ్వాసిక జంటగా శశి దర్శకత్వంలో తెరకెక్కిన నూరు సామి .. తెలుగులో వంద దేవుళ్లు పేరుతో జూన్ 19న వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో, తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. వీకెండ్ కారణంగా తొలి మూడు రోజులు ఓ మాదిరి వసూళ్లు రాబట్టిన ఈ సినిమాకు సోమవారం అసలు సిసలు అగ్నిపరీక్ష ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో నాలుగో రోజు వంద దేవుళ్లు మూవీ ఎంత వసూలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

వంద దేవుళ్లు మూడు రోజుల కలెక్షన్స్
విజయ్ ఆంటోనీ మూవీకి తొలిరోజున 75 లక్షల రూపాయలు, రెండో రోజున 1.05 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.73 కోట్ల రూపాయలు వసూలైంది. తమిళనాడులో 4.69 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 33 లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 57 లక్షల రూపాయలు, తెలంగాణలో 25 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 9 లక్షల రూపాయలు చొప్పున భారతదేశంలో 5.93 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

Vanda Devullu Day 4 Expected Box Office Collections Worldwide Vijay Antony s film faces Monday test

ఓవర్సీస్‌లో మాత్రం వంద దేవుళ్లు సినిమాకు గట్టి దెబ్బ పడింది. చిన్నా, పెద్దా సినిమాల పోటీతో పాటు సరైన ప్రమోషన్స్ లేకపోవడం ప్రభావం చూపింది. తొలి రెండు రోజులు ఓవర్సీస్‌లో తీవ్రంగా నిరాశపరిచిన విజయ్ ఆంటోనీ.. ఆదివారం మాత్రం సత్తా చాటారు. నార్త్ అమెరికా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, యూకే, యూరప్ తదితర దేశాలతో కలిపి ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 112K డాలర్లు (భారత కరెన్సీలో 1.06 కోట్ల రూపాయలు) మాత్రమే వసూలు చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తద్వారా భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు వంద దేవుళ్లు మూవీకి వరల్డ్ వైడ్‌గా 6.99 కోట్ల రూపాయలు గ్రాస్.. 3.38 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. మూడు రోజుల వరకు తమిళనాడులో 5 కోట్ల రూపాయలు, తెలుగులో 92 లక్షల రూపాయలు వసూలు చేయగా.. ఒక్క తమిళనాడులోనే దాదాపు 2.60 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది వంద దేవుళ్లు.

వంద దేవుళ్లు నాలుగో రోజు వసూళ్ల అంచనా
బడా సినిమాలు పోటీకి వచ్చినా, మిక్స్‌డ్ టాక్ వచ్చినా వీకెండ్ పుణ్యమా అని విజయ్ ఆంటోనీ ఎలాగోలా నెట్టుకొచ్చింది. కానీ సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కావడంతో సినిమా ఎంత మేరకు నిలబడుతుంది అనేది ఈరోజుతో తేలిపోనుంది. మండే టెస్ట్‌లో వంద దేవుళ్లు మూవీ పాస్ అవుతుందో? చేతులెత్తేస్తుందో మరికొద్డి గంటల్లో తేలిపోనుంది. నాలుగో రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండియాలో విజయ్ ఆంటోనీ మూవీకి 441 షోలు ప్రదర్శితమవ్వగా.. 14 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం వంద దేవుళ్లు మూవీ సోమవారం 14 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. నాలుగో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 50 లక్షల రూపాయల నుంచి 75 లక్షల రూపాయల రేంజ్‌లో వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

వంద దేవుళ్లు బ్రేక్ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి వంద దేవుళ్లు మూవీని దాదాపుప 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ ఆంటోనీ మూవీకి తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఇప్పటి వరకు కేవలం 3.38 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ మాత్రమే వసూలవ్వగా.. వంద దేవుళ్లు మూవీ క్లీన్ కావాలంటే మరో 10 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X