Varanasi Overseas Business: ఓవర్సీస్‌లో వారణాసి సంచలనం... ఏకైక హీరోగా మహేశ్ రికార్డ్, బిజినెస్ ఎన్ని కోట్లంటే?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం వారణాసి. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న డైరెక్షన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కెరీర్‌లో తొలిసారిగా మహేశ్ వంటి సూపర్‌స్టార్‌తో రాజమౌళి తీస్తోన్న మూవీ కావడం అంచనాలను మరింత పెంచేస్తోంది. దీనికి తగినట్లుగానే వారణాసి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బడా సంస్థలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య భారీ పోటీ నెలకొంది. తాజాగా ఓవర్సీస్ రైట్స్‌కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

1300 కోట్ల బడ్జెట్‌తో వారణాసి
శ్రీ దుర్గా ఆర్ట్స్, షోవింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తీకేయ, ఎస్ గోపాల్ రెడ్డిలు సంయుక్తంగా వారణాసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా... మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ప్రకాష్‌రాజ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. మిగిలిన టెక్నీషియన్స్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ మూవీగా వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని జక్కన్న అధికారికంగా ప్రకటించారు.

Varanasi Overseas Theatrical Business Phars Films reportedly Offers Record 160 Crore for SS Rajamouli-Mahesh Babu Film rights

వారణాసిపై భారీగ ప్రమోషనల్ కార్యక్రమాలు
విడుదలకు ఏడాది ముందు నుంచే వారణాసి మూవీపై ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టేశాడు రాజమౌళి.. ప్రధానంగా ఇంటర్నేషనల్ మీడియాను టార్గెట్ చేసిన ఆయన పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాను మార్కెటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ మీడియా సంస్థలకు మహేశ్, రాజమౌళి, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వారణాసికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుని సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇటీవల అంటార్కిటికాలో వారణాసి షెడ్యూల్ పూర్తి చేశారు రాజమౌళి.

వారణాసి థియేట్రికల్ బిజినెస్‌పై అంచనాలు
ఇదిలాఉండగా.. వారణాసి మూవీపై అంచనాల నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్‌పై నిత్యం మీడియాలో ఏదో ఒక న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీతో పాటు ఓవర్సీస్ రైట్స్ కోసం బడా కంపెనీలు కళ్లు చెదిరే ఆఫర్లు ఇస్తున్నాయట. థియేట్రికల్ రైట్స్ మాత్రమే కాదు.. డిజిటల్ రైట్స్, ఆడియో హక్కులు, శాటిలైట్ రైట్స్ కోసం కూడా అదే స్థాయిలో బేరసారాలు నడుస్తున్నట్లు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా థియేట్రికల్ రైట్స్ కోసం ఓ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 18 కోట్ల రూపాయలు ఆఫర్ చేయడం తెలుగు చిత్ర సీమలో సంచలనం సృష్టించింది. దీనిని బట్టి వారణాసి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

రికార్డ్ ధరకు వారణాసి ఓవర్సీస్ రైట్స్
భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ వారణాసి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా తెలుగు సహా భారతీయ భాషల్లో వారణాసి ఓవర్సీస్ రైట్స్‌ కోసం పార్శ్ ఫిలింస్ దాదాపు 160 కోట్ల రూపాయలకు ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే.. ఓవర్సీస్‌లో అత్యధిక బిజినెస్ చేసిన భారతీయ చిత్రంగా వారణాసి, ఏకైక హీరోగా మహేశ్ నిలవనున్నారు. దీనిని బట్టి ఓవర్సీస్‌లో వారణాసి బ్రేక్‌ఈవెన్ కావాలంటే ఏకంగా 350 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది. ఈ డీల్‌కు సంబంధించి చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: Varanasi ss rajamouli mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X