Varisu day 1 Collections తమిళనాడులో రికార్డుల మోత.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?

తమిళ ఇళయదళపతి విజయ్ నటించిన వారిసు చిత్రం బాక్సాఫీస్ యాత్రను ఘనంగా మొదలుపెట్టింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి రూపొందించిన ఈ చిత్రం జనవరి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు భారీగా క్రేజ్ పెంచాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డు అడ్వాన్స్ బుకింగ్ రాబట్టింది. ఇక వారిసు సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఫస్ట్ డే బ్లాక్ బస్టర్ టాక్‌తో

ఫస్ట్ డే బ్లాక్ బస్టర్ టాక్‌తో

వారిసు సినిమా తెలుగులో తప్ప ప్రపంచవ్యాప్తంగా 11వ తేదీన రిలీజ్ అయింది. రిలీజైన ప్రతీ చోట ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొంటున్నది. విజయ్ ఫెర్ఫార్మెన్స్, సినిమా కథలోని ఎమోషన్స్ ప్రేక్షకులను మెప్పించారనే విషయాన్ని క్రిటిక్స్ వెల్లడిస్తున్నారు. వంశీ పైడిపల్లి తమిళ భాషలో అడుగు పెట్టి తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొన్నాయనే రిపోర్టులు వస్తున్నాయి.

దేశవ్యాప్తంగా భారీ రెస్సాన్స్

దేశవ్యాప్తంగా భారీ రెస్సాన్స్

విజయ్ సినిమాకు పాజిటివ్ టాక్‌తో తొలి రోజు వసూళ్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా బజ్ భారీగా క్రియేట్ కావడంతో దేశవ్యాప్తంగా భారీగా ఆక్యుపెన్సీ నమోదైంది. బెంగళూరు, కోయంబత్తూరు, పాండిచ్చేరి, ముంబై, ఢిల్లీ, కోయంబత్తూరు, కోచి, త్రివేండ్రమ్ ప్రాంతంలో మంచి రెస్పాన్స్ కనిపించింది.

ఇండియా వైడ్ ఆక్యుపెన్సీ

ఇండియా వైడ్ ఆక్యుపెన్సీ

వారిసు సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. చెన్నైలో 99 శాతం, బెంగళూరులో 43 శాతం, మధురై 74 శాతం, కోయబత్తూరులో 99 శాతం, పాండిచ్చేరి 100 శాతం, సాలెం 100 శాతం, వెల్లూరులో 99 శాతం, కోచి 23 శాతం, త్రిచూరులో 99 శాతం, త్రివేండ్రమ్ 38 శాతం, ముంబై 26 శాతం, నేషనల్ కాపిటల్ రిజియన్ 21 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

తమిళనాడులో తొలి రోజు కలెక్షన్ల అంచనా

తమిళనాడులో తొలి రోజు కలెక్షన్ల అంచనా

తమిళనాడులో వారిసు చిత్రం రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. దాదాపు రిలీజైన చోట హౌస్‌ఫుల్ కలెక్షన్లతో కిటకటలాడుతున్నది. కలెక్షన్ల పరంగా విజయ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే చిత్రంగా నిలుస్తుందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రం కేవలం తమిళనాడులోనే సుమారు 22 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

మిగితా రాష్ట్రాల్లో వసూళ్ల అంచనా

మిగితా రాష్ట్రాల్లో వసూళ్ల అంచనా

ఇక తమిళనాడు మినహాయిస్తే.. ఇండియాలో ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా భారీ ఒపెనింగ్స నమోదయ్యాయి. ఈ రాష్ట్రాల్లో కూడా అత్యధిక వసూళ్లను సాధించేందుకు రెడీ అయింది. తమిళనాడేతర రాష్ట్రాల్లో ఈ చిత్రం మరో 4 నుంచి 5 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దాంతో ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో 25 నుంచి 26 కోట్లు రాబట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా

ఇక ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. అమెరికా, మలేషియాలో, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ దేశాల్లో కూడా భారీగానే వారిసు రిలీజైంది. సింగపూర్‌లో ఇప్పటికే 24 లక్షల రూపాయలు, మలేషియాలో 95 లక్షలు, ఆస్ట్రేలియాలో 34 లక్షలు, అమెరికాలో 80 లక్షలు సాధించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 30 కోట్లకుపైగానే వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X