twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కిల్లింగ్ వీరప్పన్' ఓ కొలిక్కి...రిలీజ్ డేట్ ఇదిగో

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ తన పట్టపగలు, ఎటాక్ చిత్రాలను ప్రక్కన పెట్టి 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రాన్ని విడుదలకు సిద్దం చేసారు. డిసెంబర్ 4న తెలుగు, కన్నడం, తమిళంలో విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. సందీప్‌ భరద్వాజ్‌, శివరాజ్‌ కుమార్‌, రాక్‌లైన్‌ వెంకటేష్‌, పరుల్‌ యాదవ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. బి.వి.మంజునాథ్‌, ఇ.శివప్రకాష్‌, బి.ఎస్‌.సుధీంద్ర నిర్మాతలు.

    వర్మ మాట్లాడుతూ... ''చరిత్రలోనే వీరప్పన్‌ ఓ అరుదైన వ్యక్తి. వీరప్పన్‌ కథని సినిమాగా తీయడానికి చాలా పరిశోధన చేశాను. అతని భార్య ముత్తులక్ష్మిని కలుసుకొని కొన్ని విషయాలు సేకరించాను. వాటన్నింటిని క్రోడీకరించి తీసిన సినిమా ఇది. వీరప్పన్‌ తిరిగిన ప్రాంతాల్లోనే షూటింగ్ జరిపాము''అన్నారు.

    Varma's Killing Verappan on December 4th

    వర్మ కంటిన్యూ...''వీరప్పన్ చరిత్రను తెరకెక్కించాలని చాలా సంవత్సరాలుగా ఆసక్తిగా ఉన్నా. ఆయన్ను పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. చంపడానికి పోలీసులకు 20 ఏళ్లు పట్టింది. వీరప్పన్‌ను చంపడం అనే పాయింట్‌తో సినిమా తీసేందుకు చాలాకాలం పరిశోధన చేశా'' అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు.

    అలాగే... - ''వీరప్పన్ లైఫ్‌లో చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఇది ఆయనకు సంబంధించిన బయోపిక్ కాదు. ఈ చిత్రాన్ని రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. 'ఆపరేషన్ కుకూన్'లో పాల్గొన్న వ్యక్తులను, వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీని కలిసి సమాచారం సేకరించా. వీరప్పన్ చేతిలో కిడ్నాప్ అయిన కన్నడ నటుడు రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో నటిస్తే యాప్ట్ అవుతాడని ఎంచుకున్నా. '' అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్‌చంద్ర

    English summary
    "Killing Verappan" will be simultaneously released in Telugu, Tamil, Kannada and Hindi as well on December 4th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X