Varsham Re Release Collections: చిరంజీవిని కొట్టలేకపోయిన ప్రభాస్.. వర్షం రీరిలీజ్ కలెక్షన్లు ఎన్ని కోట్లంట్లే!
టాలీవుడ్‌లో పాపులర్ నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌పై ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం వర్షం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష జంటగా శోభన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో గోపిచంద్ విలన్ పాత్ర పోషించారు. వీరు పోట్ల కథకు పరుచూరి బ్రదర్స్ మాటలు అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన 2004 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమా తాజాగా మే 23వ తేదీన రీ రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? లైఫ్ టైమ్ కలెక్షన్లు ఎంత? రిరిలీజ్ తర్వాత నమోదైన వసూళ్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
బడ్జెట్ ఎంతంటే?
ముక్కోణపు ప్రేమ కథగా రూపొందిన వర్షం సినిమాను వరంగల్ కోట ప్రాంతంలో షూటింగ్ చేసి వారసత్వ సంపదను బ్యాక్ డ్రాప్‌గా ఈ మూవీని రిచ్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాను సుమారుగా 10 కోట్ల రూపాయలతో నిర్మించారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాల మధ్య ఈ చిత్రాన్ని పోటీగా రిలీజ్ చేశారు. అయితే ఆ స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం అప్పట్లో 15.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ప్రభాస్ కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్‌గా మారింది.

చిరంజీవి, బాలకృష్ణతో పోటీగా
ఇటీవల బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ షోలో వర్షం సినిమా ప్రస్తావన వచ్చింది. ఈ సినిమా రిలీజ్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. సంక్రాంతి బరిలో బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు ఉన్నాయి. వాటి మధ్య వర్షం సినిమాను రిలీజ్ చేయడం ఎందుకు? మనం సపరేట్‌గా తర్వాత రిలీజ్ చేద్దామని నిర్మాత ఎంఎస్ రాజుకు చెప్పాను. కానీ ఆయన, ఆయన టీమ్ సభ్యులు వినకుండా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా నాకు తొలి హిట్‌ను అందించింది అని ప్రభాస్ అన్నాడు. దాంతో మీరు రాజులు కదా.. ఎవరి మాట వినరు అని బాలకృష్ణ చమత్కరించారు.
రీ రిలీజ్‌తో మరోసారి వర్షం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్నది. ఈ చిత్రం మరోసారి విడుదల కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగలా మారింది. ఈ మూవీ కోసం భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఈ చిత్రానికి సుమారుగా 70K టికెట్లు కేవలం బుక్ మై షోలోనే అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా రికార్డు లెవెల్ కాకున్నా భారీగానే వసూళ్లను సాధించింది.
వర్షం రీ రిలీజ్ కలెక్షన్లు
వర్షం సినిమా తొలి రోజు గ్రాండ్‌గా ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కలిపి ఈ మూవీ 1.9 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక రెండో రోజు ఈ సినిమా 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. మూడో రోజు కూడా అదే రేంజ్‌లో 35 లక్షల రూపాయల నెట్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 2.6 కోట్ల రూపాయలు కేవలం 3 రోజుల్లో వసూలు చేసింది.
లైఫ్ టైమ్ కలెక్షన్లు
వర్షం సినిమా ఫస్ట్ టైమ్ రిలీజ్ అయినప్పుడు 15.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాను 4K టెక్నాలజీలో రూపొందించి రీ రిలీజ్ సమయంలో 2.6 కోట్ల రాబట్టింది. దాంతో ఈ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. 18.1 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా ఇటీవల రీ రిలీజైన ఇంద్ర, జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాల కలెక్షన్లను దాటలేకపోవడం ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు.


Click it and Unblock the Notifications











