100 కోట్ల కలెక్షన్లపై కన్నేసిన పిరియాడిక్ కామెడీ మూవీ.. 9 కోట్ల బడ్జెట్‌కు ఎన్ని కోట్ల లాభమంటే?
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మలయాళ సినిమా రంగం తన సత్తాను చాటుతున్నది. ఏడాది ఆరంభం నుంచి రికార్డుల తిరగరాసే విధంగా కలెక్షన్లను రాబడుతున్నది. గత కొద్ది నెలల్లో మాలీవుడ్ సుమారుగా 750 కోట్ల రూపాయల వసూళ్లను మలయాళ సినిమాలు రాబట్టాయి. ఇలాంటి తరుణంలో వచ్చిన చిత్రం వర్షంగలక్కు శేషం. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్‌ను మరిపిస్తున్నది. ఈ సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
యువ హీరోలు ప్రణవ్ మోహన్ లాల్, నివీన్ పౌలీ, కల్యాణి ప్రియదర్శిని తదితరులు నటించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాకు విడుదలైన అన్ని చోట్ల భారీ రెస్పాన్స్ లభిస్తున్నది. దాంతో ఈ సినిమా బడ్జెట్‌కు మించిన కలెక్షన్లను నమోదు చేస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

ఇక పిరియాడిక్ కామెడీ బ్యాక్ డ్రాప్‌తో సినీ కళాకారులు, వాతావరణం నేపథ్యంగా ఈ సినిమాను రూపొందించారు. చిత్ర పరిశ్రమలో రాణించాలనే యువకుల జీవితాలను ప్రతిబింబిచేలా తెరకెక్కించారు. కేరళకు చెందిన యువకులు చెన్నైకి వెళ్లి దర్శకులు, నటులుగా మారడానికి ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారనే విషయాన్ని వినోదాత్మకంగా, ఎమోషనల్‌గా చూపించారు.
వర్షంగలక్కు శేషం చిత్రాన్ని 9 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించారు. అయితే ఈ సినిమా 9 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. అయితే ఈ సినిమా తొలివారాంతంలోనే లాభాల జోన్‌లోకి ప్రవేశించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.

వర్షంగలక్కు శేషం మూవీ తొలి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం తొలి రోజు 3 కోట్లకుపైగా కలెక్షన్లు, రెండో రోజు 2.75 కోట్లు, మూడో రోజు 3.4 కోట్లు, నాలుగో రోజు 4 కోట్లు, ఐదో రోజు 2.7 కోట్ల రూపాయలు, ఆరో రోజు 2.5 కోట్లు, ఏడో రోజు 2 కోట్లు, ఎనిమిదో రోజు 2 కోట్లు, తొమ్మిదో రోజు 2 కోట్లు, పదో రోజు 2.15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కేరళలోనే ఈ సినిమా 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఈ చిత్రం కేరళ, ఇతర రాస్ట్రాల్లో కలిపి 27 కోట్ల రూపాయల నికర కలెక్షన్లు, 32 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక మూవీ ఓవర్సీస్‌లో కూడా భారీగా రాబట్టింది. అమెరికా, గల్ఫ్, ఇతర దేశాల్లో కలిపి మొత్తంగా 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 60 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











