Varshangalkku Shesham Collections రికార్డు వసూళ్లతో వర్షంగలక్కు శేషం సంచలనం.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలతో మలయాళ సినిమా పరిశ్రమ మంచి జోష్ మీద కనిపిస్తున్నది. 2024 ఆరంభంలోనే మాలీవుడ్ సంచలన విజయాలను తన ఖాతాలో వేసుకొన్నది. భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ భారీ విజయాలు అందుకొన్నాయి. తాజాగా వర్షంగల్‌క్కు శేషం మూవీ భారీ ఆదరణను సంపాదించుకొంటున్నది. ఏప్రిల్ 11వ తేదీన రంజాన్ కానుకగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తున్నది. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ప్రణవ్ మోహన్ లాల్, ధ్యాన్ శ్రీనివాసన్, నవీన్ పౌలీ, అజు వర్గీస్ నటించిన ఈ సినిమా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా సగటు ప్రేక్షకుడి ఆదరణను సొంతం చేసుకొన్నది.విశాఖ్ సుబ్రమణ్యం నిర్మాతగా, వినీత్ శ్రీనివాసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించింది.

వర్షంగలక్కు శేషం సినిమా విషయానికి వస్తే..సినీ పరిశ్రమలో తమకంటూ ఓ స్థానం సంపాదించుకోవాలనుకొనే డ్రీమ్‌తో తమ సొంత రాష్ట్రం కేరళను వదిలి దక్షిణాదికి సినీ రాజధానిగా ఉన్న మద్రాస్‌లోని కోడంబాకం ప్రాంతానికి వెళ్తారు. అయితే అక్కడ వారికి ఎదురైన అనుభవాలు ఏమిటి? తమ కలను సాకారం చేసుకొన్నారా? అనేది ఈ సినిమా కథ.
పిరియాడిక్ కామెడీ చిత్రంగా రూపొందిన వర్షంగలక్కు శేషం సినిమాను భారీ తారాగణంతో రూపొందించారు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఖర్చులతోపాటు ప్రొడక్షన్ ఖర్చులు, ప్రమోషనల్ ఖర్చులు అన్నీకలిపి మొత్తంగా 9 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. అయితే ఈ సినిమా 9 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

వర్షంగలక్కు శేషం సినిమా తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ సినిమా తొలి ఆట నుంచే గ్రాండ్ ఓపెనింగ్స్‌ను సాధించింది. తొలి రోజు ఈ సినిమా కేవలం మలయాళంలోనే 3 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. రెండో రోజు ఈ సినిమా 2.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇక మూడో రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. 3 రోజుల్లో మొత్తంగా కేరళలో 7.5 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఇక ఈ చిత్రానికి ఓవర్సీస్‌లో భారీ రెస్పాన్స్ వస్తున్నది. గల్ఫ్‌లో రెండు రోజుల్లో ఈ సినిమా 1.4 మిలియన్లు అంటే 11.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది.నార్త్ అమెరికాలో ఈ చిత్రం 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక ఇతర దేశాల్లో కలిపి ఓవర్సీస్‌లో 20 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 28 కోట్ల రూపాయలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











