Varshangalkku Shesham Collections బాక్సాఫీస్ ఊచకోత.. 50 కోట్లకు చేరువగా.. 5 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

మలయాళంలో యువ హీరోలు ప్రణవ్ మోహన్ లాల్, నివీన్ పౌలీ, కల్యాణి ప్రియదర్శిని తదితరులు నటించిన చిత్రం వర్షంగలక్కు శేషం. విశాక్ సుబ్రమణ్యం నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. అంచనాలను తలకిందులు చేస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్నది. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత ఐదు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..

పిరియాడిక్ కామెడీ చిత్రంగా రూపొందిన వర్షంగలక్కు శేషం చిత్రాన్ని సుమారుగా 9 కోట్ల రూపాయలతో రూపొందించారు. అయితే ఈ సినిమా 9 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. అయితే ఈ సినిమా తొలివారాంతంలోనే లాభాల జోన్‌లోకి ప్రవేశించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఈ కలెక్షన్ల ప్రవాహం ఎక్కడ ఆగుతుందని ట్రేడ్ నిపుణులు ఆసక్తిగా చూస్తున్నారు.

Varshangalkku Shesham day wise Box Office Collections Worldwide

మోహన్ లాల్ వారసుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన ఈ సినిమా తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. ఈ సినిమా తొలి రోజు 3 కోట్లకుపైగా, 2వ రోజు 3 కోట్లు, మూడో రోజు 3.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో తొలివారాంతంలో 13.5 కోట్ల రూపాయలను కేవలం కేరళలోనే వసూలు చేసింది.

ఇక ప్రతీ సినిమాకు కఠిన పరీక్షగా మారే సోమవారం కూడా నిలకడగా కలెక్షన్లు సాధించడంతో ఈ సినిమా రేంజ్ మరో లెవెల్‌లో ఉందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇక ఈ సినిమా 5వ రోజు కేరళలో 50 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది. కోజికోడ్, త్రిచూర్ ప్రాంతాల్లో 80 శాతానికి పైగా కలెక్షన్లు, మిగితా ప్రాంతాల్లో 60 నుంచి 701 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

ఇక ఈ మూవీ 5వ రోజు కూడా భారీగానే వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం కేరళ బాక్సాఫీస్ వద్ద 2 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. దాంతో ఈ సినిమా కేరళలోనే 16 కోట్ల మేర వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో కూడా ఈ మూవీ అధికంగా కలెక్షన్లు రాబడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఇక నవీన్ పౌలీ, కల్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రానికి ఓవర్సీస్‌లో కూడా రికార్డు వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా 5 రోజుల్లోనే 3 మిలియన్ డాలర్ల అంటే.. 27 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. త్వరలోనే ఈ సినిమా 50 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X