twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ghani Day 2 Collections: వరుణ్ తేజ్ కు ఊహించని షాక్.. రెండవ రోజే దారుణమైన దెబ్బ!

    |

    మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గణేష్ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా చేదు అనుభవాన్ని ఎదుర్కొంటోంది. మొదటి రోజే చాలా తక్కువ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా దారుణమైన రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తం ఎంత రాబట్టాలి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

     వరుణ్ తేజ్ హార్డ్ వర్క్

    వరుణ్ తేజ్ హార్డ్ వర్క్

    మెగా హీరో వరుణ్ ప్రతి సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ ను పెంచుకుంటూ ఉన్నాడు. వరుణ్ తేజ్ ఈసారి సరికొత్త గా గని సినిమాతో తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలి అని అనుకున్నాడు. తనకు ఎంతో సన్నిహితంగా ఉండే కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఫిట్నెస్ విషయంలో చాలా మార్పులకు ఇచ్చాడు. అందుకోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుని హార్డ్ వర్క్ కూడా చేశాడు.

    ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రీ రిలీజ్ బిజినెస్

    వరుణ్ తేజ్ న్యూ లుక్ తోనే గని సినిమా పై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. దీంతో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బిజినెస్ ఐతే ఏర్పడింది. ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నైజాం రూ.8 కోట్లు, సీడెడ్ 3.50 కోట్లు ఏకా ఆంధ్ర ఏరియాల్లో మొత్తంగా 9.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా కర్ణాటకలో అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.50 కోట్ల ధర పలికింది. ఇక ఓవర్సీస్ లో 1.80 కోట్లతో గని సినిమా వరల్డ్ వైడ్ గా రూ.25.30 కోట్లతో మంచి బిజినెస్ డీల్స్ అందుకుంది.

     మొదటి రోజే చాలా తక్కువగా

    మొదటి రోజే చాలా తక్కువగా

    ఇక మొదటి రోజు ఈ సినిమాకు అనుకున్నంతగా పాజిటివ్ టాక్ అయితే ఏమి రాలేదు. ఒకవైపు RRR సినిమా వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్న సమయంలోనే గని సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు పెద్దగా బజ్ క్రియేట్ చేయని గని మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.22 కోట్ల షేర్ మాత్రమే సాధించింది.

    రెండవ రోజు మరింత దారుణంగా

    రెండవ రోజు మరింత దారుణంగా

    గని సినిమా రెండవ రోజు కూడా దారుణమైన ఒపెనింగ్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక విధంగా వరుణ్ తేజ్ కెరీర్ లోనే అతి తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడం షాకింగ్ అనే చెప్పాలి. సినిమా కొన్ని ఎలిమెంట్స్ తో బాగానే ఎట్రాక్ట్ చేసినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాలు పెద్దగా ఎట్రాక్ట్ అవ్వలేదు. దీంతో రెండవ రోజు అన్ని ఏరియాల్లో కలుపుకొని ఏపి తెలంగాణలో 72 లక్షల షేర్ మాత్రమే వచ్చింది.

    2 రోజుల్లో వచ్చిన టోటల్ కలెక్షన్స్

    2 రోజుల్లో వచ్చిన టోటల్ కలెక్షన్స్

    గని విడుదలకు ముందు హైప్ క్రియేట్ చేయడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఓపెనింగ్స్ చాలా తక్కువగా వచ్చాయి. రెండవ రోజే లక్షల్లోకి రావడం షాక్ అనే చెప్పాలి. ఇక రెండు రోజుల్లో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో 1.10 కోట్లు, సీడెడ్ 36 లక్షలు, ఉత్తరాంధ్ర 49 లక్షలు, ఈస్ట్ 24 లక్షలు, వెస్ట్ 17 లక్షలు, గుంటూరు 22 లక్షలు, కృష్ణ 22 లక్షలు, నెల్లూరు 14 లక్షలు.

    ప్రపంచవ్యాప్తంగా..

    ప్రపంచవ్యాప్తంగా..

    రెండు తెలుగు రాష్ట్రాల్లో గని సినిమా బాక్సాఫీస్ వద్ద రెండు రోజుల్లో 2 94కోట్ల షేర్, 5.35కోట్ల గ్రాస్ ను సాధించింది. కర్ణాటక ఓవర్సీస్ లో కలిపి 20 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇక ఓవర్సీస్ లో 0.25కోట్లు రాబట్టిన గని ప్రపంచవ్యాప్తంగా 3.39 కోట్ల షేర్, 6 35కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

    ఇంకా ఎంత రావాలంటే..

    ఇంకా ఎంత రావాలంటే..

    గని సినిమా రెండు రోజుల్లోనే కలెక్షన్స్ విషయంలో దారుణమైన ఫలితాన్ని అందుకుంది. వరుణ్ తేజ్ ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన ఈ బాక్సింగ్ మూవీ బాక్సాఫీస్ వద్ద పంచ్ ప్రభావాన్ని చూపలేకపోయింది. 25.30కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 26.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయాల్సి ఉంది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా 22.91 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. గని ఆ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఏదైనా మ్యాజిక్ క్రియేట్ అయితే తప్ప నష్టాల నుంచి తప్పించుకోలేదు.

    English summary
    Varun tej ghani movie day 2 total worldwide collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X