Matka Day 1 Box Office: మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లు ..మట్కా మూవీకి తొలి రోజు ఎన్ని కోట్లంటే?
Matka Day 1 Box Office: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ మూవీ 'మట్కా'( Matka ). ఈ సినిమాకు డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వం వహించగా.. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే.. తొలి రోజు ( డే 1)ఎన్ని కోట్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..
వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్నారు వరుణ్ తేజ్. ఎలాగైనా ఈ సారి హిట్ కొట్టాలని రతన్ ఖేత్రి అనే మట్కా గ్యాంగ్ స్టర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మట్కా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా.. నోరా ఫతేహి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించారు. మట్కా మూవీ కథ విషయాని వస్తే.. 1950 నుంచి 1980 మధ్య కాలంలో మట్కా అనే గ్యాంబ్లింగ్ గేమ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో హీరో వరుణ్ తేజ్.. 'వాసు' అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు.

వాసు అనే వ్యక్తి తన చిన్నతనంలో బర్మా నుంచి శరణార్తిగా వైజాగ్ చేరుకుంటారు. పేదరికంతో వాసు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ.. జీవితాన్ని గడుపుతాడు. ఈ సమయంలో చేయని తప్పుకు జైలుకు వెళ్తాడు వాసు. జైలులో జరిగిన కొన్ని పరిణామాలతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలో వాసు మట్కా అనే గ్యాంబ్లింగ్ గేమ్ బిజినెస్ లో అడుగు పెడతాడు. ఈ బిజినెస్ లో వాసు.. కోట్లు సంపాదిస్తాడు. ఆ బిజినెస్ రాణిస్తాడు. కటిక పేదరికంలో పుట్టిన వాసు.. మట్కా కింగ్ గా ఎలా ఎదుగుతాడు. ఈ ప్రయాణంలో అతడు ఎదుర్కొంటున్న సవాళ్లు? ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మట్కా మూవీ.
వరుణ్ తేజ్(Varun Tej) మట్కా (Matka Movie Day 1 Collections) వివరాల్లోకెళ్తే.. మెగా ప్రిన్స్ మూవీ మట్కా మూవీపై భారీ లెవల్ లో ఆడియన్స్ హోప్స్ ను పెట్టుకోగా.. ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం.. మైండ్ బ్లోయింగ్ కలెక్షన్ల సొంతం చేసుకుంది. మట్కాకు పోటీగా బరిలో దిగిన కంగువ(kanguva) మూవీ మాత్రం హై రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. సక్సెస్ దిశగా పరుగులు పెడుతోంది. కానీ వరుణ్ తేజ్ తన గత సినిమాల ఓపెనింగ్స్ నీ మ్యాచ్ చేయలేకపోయారనే చెప్పాలి.

సాక్నిల్క్ అంచనా ప్రకారం.. మట్కా మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.0.70 కోట్లు (నెట్) వసూళ్లను రాబడుతుందని అంచనా వేసింది. ఇతర రిపోర్టు ప్రకారం.. మట్కా మూవీ తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల నుంచి కోటి లోపు ఓపెనింగ్స్ ను అందుకోవచ్చనీ, వరల్డ్ వైడ్ 1.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేశారు. మట్కా మూవీ తొలి రోజు థియేటర్ ఆక్యుపెన్సీ కూడా 20 శాతం కంటే తక్కువగానే ఉందని సమాచారం. కాస్తా మౌత్ టాక్ పెరిగితే.. మూవీ కలెక్షన్లు పెరిగే అవకాశముందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వీకెండ్ లో ఏ రేంజ్ కలెక్షన్లు వసూళు చేస్తోందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











