Matka Day 2 Box Office : ఊహించని రీతిలో మట్కా కలెక్షన్స్.. రెండవ రోజు ఎన్ని కోట్లంటే?
Matka Day 2 Box Office: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ మూవీ 'మట్కా'(Matka). ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రజనీ తాళ్లూరి, విజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మట్కా మూవీ నవంబర్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీకి యావరేజ్ టాక్ వస్తోంది. కలెక్షన్ల పరంగా మట్కా పరిస్థితి ఎలా ఉంది ? ఇప్పటి వరకూ ఎన్ని కోట్లు వసూలు చేసింది? రెండవ రోజు (డే 2)ఎన్ని కోట్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..
వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని గ్యాంగ్ స్టర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మట్కా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరైన ఫలితం దక్కలేదు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించగా.. టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. నోరా ఫతేహి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించారు. మట్కా మూవీ కథ విషయాని వస్తే.. 1950-1980 మధ్య కాలంలో మట్కా అనే గ్యాంబ్లింగ్ గేమ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే విషయాల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు.

ఈ మూవీలో హీరో వరుణ్ తేజ్.. 'వాసు' అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు. వాసు తన చిన్నతనంలో బర్మా నుంచి శరణార్తిగా వైజాగ్ చేరుకుంటారు. పేదరికంతో బాధపడుతున్న వాసు.. తన అవసరాల కోసం.. చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. అయితే.. ఒకసారి చేయని తప్పుకు జైలులో శిక్ష అనుభవిస్తాడు. జైలులో ఎదురైన అనుభవాలతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో వాసు మట్కా అనే గ్యాంబ్లింగ్ గేమ్ ను ప్రారంభిస్తాడు. అనతికాలంలోనే బిజినెస్ లో వాసు కోట్లు సంపాదిస్తాడు. ఆ బిజినెస్ కు కింగ్ గా మారుతాడు. కటిక పేదరికంలో పుట్టిన వాసు.. చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు.. ఒక్కసారిగా మట్కా కింగ్ గా ఎలా ఎదుగుతాడు. అతని ప్రయాణంలో ఎదురైన సవాళ్లు లేంటీ? ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది? మట్కా మూవీ.
వరుణ్ తేజ్(Varun Tej) మట్కా (Matka Movie Collections) వివరాల్లోకెళ్తే.. మెగా ప్రిన్స్ మూవీ మట్కా భారీ యాక్షన్ సన్ని వేశాలతో, భారీ అంచనాలతో విడుదలైంది. కానీ, ఎవరు ఊహించని విధంగా.. యావరేజ్ టాక్ వచ్చింది. ఈ సినిమా కలెక్షన్స్ ఊహించని విధంగా ఉన్నాయి. వరుణ్ తేజ్ తన గత సినిమాల ఓపెనింగ్స్.. ఈ సినిమా ఓపెనింగ్స్ అసలు మ్యాచ్ చేయలేకపోయారనే చెప్పాలి. మట్కా మూవీనీ దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. సుమారు 18 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

సాక్నిల్క్ అంచనా ప్రకారం.. మట్కా మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.0.71 కోట్లు (నెట్)వసూళ్లను రాబడుతుందని పేర్కొంది. ఇతర రిపోర్టు ప్రకారం.. మట్కా మూవీ వరల్డ్ వైడ్ రూ. 2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. రెండో రోజు కూడా మట్కా మూవీ దారుణమైన కలెక్షన్లను వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం రూ. 70 లక్షల మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా రూ. 1.2 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి పరిస్థితి కొనసాగితే మట్కా మూవీ మేకర్స్ కు భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ వీకెండ్ లో మూవీ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. మరి ఎలాంటి కలెక్షన్లు వసూలు చేస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా మట్కా మూవీ వరుణ్ ఫ్యాన్స్ కు నిరాశ పరిచింది.


Click it and Unblock the Notifications











