Matka Day 3 Box Office: వరుణ్ తేజ్ మూవీకి డిజాస్టర్ కలెక్షన్లు.. మట్కా మూడవ రోజు ఎన్ని కోట్లంటే?

Matka Day 3 Box Office: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ మూవీ 'మట్కా'(Matka). ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ నవంబర్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈమూవీ తొలిరోజే యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. కలెక్షన్ల పరంగా 'మట్కా' మూవీ పరిస్థితి ఎలా ఉంది ? ఇప్పటి వరకూ ఎన్ని కోట్లు వసూలు చేసింది? మూడవ రోజు (డే 3)ఎన్ని కోట్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..

మెగా హీరో వరుణ్ తేజ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ 'మట్కా'కు డైరెక్టర్ కరుణా కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజయేంద్రరెడ్డి తీగల, రజినీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మట్కా వాసుగా వరుణ్ తేజ్, సుజాతగా మీనాక్షి చౌదరి, సోఫియాగా నోరా ఫతేహి, పద్మగా సలోని అశ్వని, నారాయణ మూర్తిగా పి.రవిశంకర్, నానిబాబుగా కిషోర్, సాహుగా నవీన్ చంద్ర, అప్పల రెడ్డిగా అజయ్ ఘోష్ నటించారు.

Varun Tej Matka movie Day 3 Box Office Collections World Wide

వరణ్ తేజ్ వ‌రుస డిజాస్ట‌ర్లతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని గ్యాంగ్‌ స్టర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మట్కా' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. జూద సామ్రాజ్యం నేపధ్యంలో సాగే అద్భుతమైన కథాంశం'మట్కా'. ఈ మూవీలో 1970- 1980ల మధ్యకాలంలో విశాఖపట్నం లోని సామాజిక-ఆర్థిక వ్యవస్థను చూపించే ప్రయత్నం చేశారు. ఈ మూవీలో హీరో వరుణ్ తేజ్.. 'వాసు' అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు.

మట్కా (Matka Movie Collections) వివరాల్లోకెళ్తే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'మట్కా' మూవీ భారీ అంచనాలతో విడుదలైంది. కానీ, ఎవరు ఊహించని విధంగా.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ కూడా దారుణంగా ఉన్నాయి. ఓపెనింగ్ కలెక్షన్లు కూడా దారుణంగా ఉన్నాయి. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ తొలిరోజు కేవలం కోటీ రూపాయాల కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ మూవీ విడుదలై మూడో రోజులు గడిచిన సినిమా టోటల్ వసూళ్లు రూ.3 కోట్ల లూపే ఉన్నాయంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

Varun Tej Matka movie Day 3 Box Office Collections World Wide

సాక్నిల్క్ అంచనా ప్రకారం.. మట్కా మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ.0.71 కోట్లు (నెట్) మాత్రమే రాబట్టింది. ఇతర రిపోర్టు ప్రకారం.. మట్కా మూవీ వరల్డ్ వైడ్ రూ. 2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. రెండో రోజు కూడా పరిస్థితి దారుణంగానే ఉంది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 66 లక్షల మాత్రమే వసూలు చేసింది. ఇక మూడో రోజు కూడా మట్కా సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. మొదటి శనివారం( డే 3) ఈ సినిమా కేవలం 76 లక్షల రూపాయల బిజినెస్ చేసింది. దీంతో ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ. 2.12 కోట్లకు చేరింది.

వాస్తవానికి వీకెండ్ లో కలెక్షన్లు పెరుగుతాయని ఆశించారు. కానీ, ఫలితం మరోలా ఉంది. మట్కా మూవీ విడుదలై మూడు రోజులైనా మూడు కోట్ల మార్క్‌ను కూడా దాటలేకపోయింది. రూ. 35 కోట్ల బడ్జెట్ విడుదల అయినా సినిమా రోజులు గడుస్తున్న కొద్దీ వసూళ్లు తగ్గుతాయి. ఇలాంటి పరిస్థితి కొనసాగితే మట్కా మూవీ మేకర్స్ కు భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ సండే మూవీ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. మరి ఎలాంటి కలెక్షన్లు వసూలు చేస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా మట్కా మూవీ వరుణ్ ఫ్యాన్స్ కు నిరాశ పరిచింది.

More from Filmibeat

Read more about: matka matka collection varun tej
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X