Matka Day 4 Box Office: వీకెండ్ లో మైండ్ బ్లాంక్ కలెక్షన్లు.. మట్కా నాలుగవ రోజు ఎన్ని కోట్లంటే?
Matka Day 4 Box Office: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ మూవీ 'మట్కా'(Matka). ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ నవంబర్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. కానీ, బీలో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. మరీ కలెక్షన్ల పరంగా 'మట్కా' మూవీ పరిస్థితి ఏంటీ? ఇప్పటి వరకూ ఎన్ని కోట్లు వసూలు చేసింది? నాలుగవ రోజు (డే 4)ఎన్ని కోట్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..
పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ 'మట్కా'. ఈ సినిమాకు డైరెక్టర్ కరుణా కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయేంద్రరెడ్డి తీగల, రజినీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మట్కా గ్యాంగ్ స్టార్ వాసుగా వరుణ్ తేజ్, సుజాతగా మీనాక్షి చౌదరి, సోఫియాగా నోరా ఫతేహి, పద్మగా సలోని అశ్వని, నారాయణ మూర్తిగా పి.రవిశంకర్, నానిబాబుగా కిషోర్, సాహుగా నవీన్ చంద్ర, అప్పల రెడ్డిగా అజయ్ ఘోష్ నటించారు.

వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న మెగా హీరో వరుణ్ తేజ్.. గ్యాంగ్ స్టర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మట్కా' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మట్కా అనే జూద సామ్రాజ్యం నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో 1970- 1980ల మధ్యకాలంలో విశాఖపట్నం లోని సామాజిక, ఆర్థిక వ్యవస్థను చూపించే ప్రయత్నం చేశారు మూవీ మేకర్స్. ఈ మూవీలో హీరో వరుణ్ తేజ్.. 'వాసు' అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావించారు వరుణ్ బాబు. కానీ, ఫలితం మరోలా ఉంది.
మట్కా ( Matka Collections ) వివరాల్లోకెళ్తే.. వరుణ్ తేజ్ 'మట్కా' మూవీ భారీ అంచనాలతో విడుదలైంది. కానీ, ఎవరు ఊహించని విధంగా బీలో యావరేజ్ టాక్ వచ్చింది. దీంతో డిజాస్టర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రమే కాదు వీకెండ్ కలెక్షన్లు కూడా దారుణంగా ఉన్నాయి. రూ. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన మట్కా మూవీ తొలిరోజు కేవలం కోటీ రూపాయాల కలెక్షన్లు చేయలేకపోయింది. వీకెండ్ లో కలెక్షన్లు పెరుగుతాయని ఆశపడ్డ.. నిరాశే మిగిలింది. మట్కా మూవీ విడుదలై నాలుగు రోజులు గడిచిన సినిమా మొత్తం కలెక్షన్లు రూ. 4 కోట్లు ( ఇండియన్ బాక్సాఫీస్) కూడా దాటలేదంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సాక్ నిల్క్ అంచనా ప్రకారం.. మట్కా మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు కేవల రూ.0.71 కోట్లు (నెట్) మాత్రమే రాబట్టింది. ఇతర రిపోర్టు ప్రకారం.. మట్కా మూవీ వరల్డ్ వైడ్ రూ. 2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. రెండో రోజు కూడా ఇదే పరిస్థితి. కేవలం రూ. 66 లక్షల మాత్రమే వసూలు చేసింది. ఇక మూడో రోజు ..పైగా శనివారం వీకెండ్ కలెక్షన్లు పెరుగుతాయని భావిస్తే.. మొదటి శనివారం( డే 3)రూ.76 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇక నాలుగో రోజు కూడా మట్కా సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. కలెక్షన్లు పెరుగుతాయని భావించిన కేవలం రూ. 52 లక్షలు మాత్రమే వసూళ్లు చేసింది. దీంతో మట్కా మూవీ మొత్తం వసూళ్లు రూ. 2.65 కోట్లకు చేరింది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్లు చూస్తూ..దాదాపు రూ. 4 కోట్లకు చేరువలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఓపెనింగ్ కలెక్షన్లలో తేడా కొట్టినా.. వీకెండ్ కలెక్షన్లు పెరుగుతాయని మూవీ మేకర్స్ ఆశించారు. కానీ, కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. రూ. 35 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన మూవీ కలెక్షన్లు రోజురోజుకు తగ్గుతాయి. ఇలాంటి పరిస్థితి చూస్తే.. మట్కా మూవీ మేకర్స్ భారీ నష్టాన్ని ముఠా గట్టుకున్నట్టు తెలుస్తోంది. మట్కా మూవీ వరుణ్ బాబుకే కాదు.. మెగా ఫ్యాన్స్ కు నిరాశ పరిచిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











