Matka Day 5 Box Office: డిజాస్టర్ కలెక్షన్స్..మట్కా ఐదవ రోజు ఎన్ని కోట్లంటే?
పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ మట్కా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా నవంబర్ 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ యాక్షన్ మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. కానీ,ఎవరూ ఊహించని విధంగా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. మరీ కలెక్షన్ల పరంగా 'మట్కా' మూవీ పరిస్థితి ఏంటీ? ఇంతవరకూ ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఐదవ రోజు (డే 5)ఎన్ని లక్షలు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..
వరుణ్ తేజ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'మట్కా'. ఈ సినిమాకు డైరెక్టర్ కరుణా కుమార్ దర్శకత్వం వహించగా.. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయేంద్రరెడ్డి తీగల, రజినీ తాళ్లూరి నిర్మించారు. ఈ సినిమాలో మట్కా గ్యాంగ్ స్టార్ వాసుగా వరుణ్ తేజ్ నటించగా.. సుజాతగా మీనాక్షి చౌదరి, సోఫియాగా నోరా ఫతేహి లీడ్ లో నటించారు అలాగే.. పద్మ గా సలోని అశ్వని, నారాయణ మూర్తి గా పి.రవిశంకర్, నానిబాబుగా కిషోర్, సాహుగా నవీన్ చంద్ర, అప్పల రెడ్డిగా అజయ్ ఘోష్ పాత్రల్లో కనిపించారు.

వరుస వైఫల్యాలను ఎదుర్కొంటున్న వరుణ్ తేజ్.. రతన్ అనే గ్యాంగ్ స్టర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మట్కా' సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మట్కా అనే గ్లాంబ్లింగ్ గేమ్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో 1970-1980ల మధ్యకాలంలో విశాఖపట్నంలోని సామాజిక, ఆర్థిక అంశాలను చూపించారు మూవీ మేకర్స్. ఈ మూవీలో హీరో వరుణ్ తేజ్.. 'వాసు'అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని వరుణ్ బాబు కష్టం పడ్డ ఫలితం మాత్రం దక్కలేదు. ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ తో సాగింది.
మట్కా (Matka Collections) వివరాల్లోకెళ్తే.. వరుణ్ తేజ్ 'మట్కా' మూవీ భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కానీ, ఎవరు ఎక్సాపర్ట్ చేయని విధంగా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. డిజాస్టర్ కలెక్షన్లను తెచ్చుకుంటుంది. ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రమే కాదు.. వీకెండ్ కలెక్షన్లు కూడా దారుణంగా ఉన్నాయి. రూ. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన మట్కా మూవీ ఫస్ట్ డే కనీసం కోటి రూపాయాలను కూడా కలెక్ట్ చేయలేకపోయిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీకెండ్ లో అయినా కలెక్షన్లు పెరుగుతాయని ఆశించినా నిరాశే మిగిలింది. మట్కా మూవీ విడుదలై ఐదు రోజులు పూర్తి అయినా.. మొత్తం కలెక్షన్లు రూ.5 కోట్లు కూడా దాటలేదంటే.. ఎలాంటి బిజినెస్ జరుగుతుంది అర్థం చేసుకోవచ్చు.

సాక్ నిల్క్ అంచనా ప్రకారం.. మట్కా మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు కేవల రూ.0.71 కోట్లు (నెట్) మాత్రమే రాబట్టింది. రెండో రోజు కూడా ఇదే పరిస్థితి. కేవలం రూ. 66 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇక మూడో రోజు.. శనివారం వీకెండ్ కలెక్షన్లు పెరుగుతాయని భావించినా.. అంచనాలు తారుమారు అయ్యాయి. మొదటి శనివారం (డే 3)రూ.76 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇక నాలుగో రోజు కూడా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. ఆదివారం నాడు కేవలం రూ. 52 లక్షలు మాత్రమే వసూళ్లు చేసింది. ఇక ఐదవ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. కేవలం రూ. 42 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దీంతో మట్కా మూవీ మొత్తం వసూళ్లు రూ.3.07 కోట్లకు చేరింది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్లు చూస్తూ..దాదాపు రూ.4.5 కోట్లకు చేరువలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఓపెనింగ్స్ తేడా కొట్టినా.. వీకెండ్ కలెక్షన్లు పెరుగుతాయని మూవీ మేకర్స్ ఆశించారు. కానీ, కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. రూ. 35 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన మూవీ కలెక్షన్లు రోజురోజుకు తగ్గుతాయి. ఈ పరిస్థితిని చూస్తే.. మట్కా మూవీ మేకర్స్ కు భారీ ఎదురుదెబ్బ తలిగిందనే చెప్పాలి. మట్కా మూవీ కేవలం వరుణ్ బాబుకే కాదు.. మెగా ఫ్యాన్స్ ను కూడా తీవ్ర నిరాశ పరిచింది.


Click it and Unblock the Notifications











