Matka Day 6 Box Office: వరుణ్ తేజ్ బిగ్గెస్ట్ డిజాస్టర్.. మట్కా ఆరవ రోజు ఎన్ని కోట్లంటే?

Matka Day 6 Box Office: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటేస్ట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ మట్కా((Matka). ఈ మూవీ నవంబర్ 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ భారీ బడ్జెట్ మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. కానీ, ఎవరూ ఊహించని విధంగా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. మరీ కలెక్షన్ల పరంగా 'మట్కా' మూవీ పరిస్థితి ఏంటీ? ఇంతవరకూ ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఆరవ రోజు (డే 6)ఎన్ని లక్షలు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..

వరుణ్ తేజ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'మట్కా'. ఈ సినిమాకు డైరెక్టర్ కరుణా కుమార్ దర్శకత్వం వహించగా.. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజయేంద్రరెడ్డి తీగల, రజినీ తాళ్లూరి నిర్మించారు. ఈ సినిమాలో మట్కా గ్యాంగ్ స్టార్ వాసుగా వరుణ్ తేజ్ నటించగా.. సుజాతగా మీనాక్షి చౌదరి, సోఫియాగా నోరా ఫతేహి లీడ్ లో నటించారు. ఈ మూవీలో సలోని అశ్వని.. పద్మ, నారాయణ మూర్తి గా పి.రవిశంకర్, నానిబాబుగా కిషోర్, సాహుగా నవీన్ చంద్ర, అప్పల రెడ్డిగా అజయ్ ఘోష్ పాత్రల్లో కనిపిస్తున్నారు.

Varun Tej Matka movie Day 6 Box Office Collections World Wide

మట్కా (Matka Collections) వివరాల్లోకెళ్తే.. వరుణ్ తేజ్ 'మట్కా' మూవీ భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కానీ, ఎవరు ఎక్సాపర్ట్ చేయని విధంగా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. డిజాస్టర్ కలెక్షన్లను తెచ్చుకుంటుంది. ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రమే కాదు.. వీకెండ్ కలెక్షన్లు కూడా దారుణంగా ఉన్నాయి. రూ. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన మట్కా మూవీ ఫస్ట్ డే కనీసం కోటి రూపాయాలను కూడా కలెక్ట్ చేయలేకపోయిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీకెండ్ లో అయినా కలెక్షన్లు పెరుగుతాయని ఆశించినా నిరాశే మిగిలింది. మట్కా మూవీ విడుదలై ఐదు రోజులు పూర్తి అయినా.. మొత్తం కలెక్షన్లు రూ.5 కోట్లు కూడా దాటలేదంటే.. ఎలాంటి బిజినెస్ జరుగుతుంది అర్థం చేసుకోవచ్చు.

సాక్ నిల్క్ అంచనా ప్రకారం.. మట్కా మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు కేవల రూ.0.71 కోట్లు (నెట్) మాత్రమే రాబట్టింది. రెండో రోజు కూడా ఇదే పరిస్థితి. కేవలం రూ. 66 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇక మూడో రోజు.. శనివారం వీకెండ్ కలెక్షన్లు పెరుగుతాయని భావించినా.. అంచనాలు తారుమారు అయ్యాయి. మొదటి శనివారం (డే 3)రూ. 75 లక్షలు మాత్రమే రాబట్టింది. నాలుగో రోజు కూడా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. ఆదివారం నాడు కేవలం రూ. 52 లక్షలు మాత్రమే వసూళ్లు చేసింది. ఐదవ రోజు రూ. 40 లక్షలు మాత్రమే వసూలు చేసింది.

Varun Tej Matka movie Day 6 Box Office Collections World Wide

ఇక ఆరవ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. కేవలం రూ. 32 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దీంతో వరుణ్ తేజ్ 'మట్కా' మూవీ మొత్తం వసూళ్లు రూ.3.36 కోట్లకు చేరింది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తూ.. దాదాపు రూ. 4.5 కోట్లకు చేరువలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక థియేటర్ ఆక్యూపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షో లో 9.65 శాతం, మాట్నీ షో 13. 62 శాతం, ఫస్ట్ షో 14. 33 శాతం, సెకండ్ షో లో 20.03 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. ఇలా మంగళవారం (నవంబర్ 19) మొత్తం 14.41 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. ఆ యాక్షన్ డ్రామా రూ. 35 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. కానీ, మూవీ కలెక్షన్లు రోజురోజుకు తగ్గుతాయి. ఈ పరిస్థితిని చూస్తే.. మట్కా మూవీ మేకర్స్ కు భారీ ఎదురుదెబ్బ తలిగిందనే చెప్పాలి.

More from Filmibeat

Read more about: matka matka collection varun tej
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X