Gaddalakonda Ganesh హవా.. 2 రోజుల్లో ఇదీ కలెక్షన్ల ప్రవాహం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా సినిమా గద్దలకొండ గణేష్ హవా కొనసాగుతోంది. విడుదలకు ఒక్క రోజు ముందే వాల్మీకి నుంచి గద్దలకొండ గణేష్ గా ఈ సినిమా పేరు మార్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుండటం ట్రేడ్ వర్గాల్లో ఆనందం చిగురింప జేస్తోంది.

తొలి రోజే గద్దలకొండ గణేష్

తొలి రోజే గద్దలకొండ గణేష్

ఈ శుక్రవారం (సెప్టెంబర్ 20న) విడుదలైన గద్దలకొండ గణేష్ (వాల్మీకి) చిత్రం తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం తొలి రోజున రూ.5.83 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో కలుపుకొని రూ.6.81 కోట్ల షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

రెండో రోజూ కొనసాగిన హవా

రెండో రోజూ కొనసాగిన హవా

బాక్సాఫీస్ వద్ద గద్దలకొండ గణేష్ హవా రెండో రోజు కూడా కనిపించింది. మాస్, క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ రెండో రోజు ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.06 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. గద్దలకొండ గణేష్ సక్సెస్ ఫుల్ రన్ చూసి మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఏరియా వైస్ రిపోర్ట్ చూస్తే

ఏరియా వైస్ రిపోర్ట్ చూస్తే

ఇక గద్దలకొండ గణేష్ ఏరియా వైస్ రిపోర్ట్ చూస్తే.. నిజాంలో 3.04 కోట్లు, సీడెడ్ లో 1.40 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 0.70 కోట్లు, వెస్ట్ గోదావరిలో 0.75 కోట్లు, కృష్ణాలో 0.69 కోట్లు, గుంటూరులో 0.94 కోట్లు, నెల్లూరులో 0.38 కోట్లు, వైజాగ్ లో 1.16 కోట్లు రాబట్టింది గద్దలకొండ గణేష్ సినిమా.

జోష్ చూస్తుంటే ఈ వారం కూడా

జోష్ చూస్తుంటే ఈ వారం కూడా

ఇక ప్రస్తుతం గద్దలకొండ గణేష్ జోష్ చూస్తుంటే ఈ వారం అంతా వరుణ్ తేజ్ హవా కొనసాగుతుందని తెలుస్తోంది. చిత్రంలో వరుణ్ నటనపై సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు గుప్పిస్తుండటం సినిమాకు బాగా కలిసొచ్చే అంశం. ఈ వారాంతం వరకు వసూళ్లు నిలకడగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

గద్దలకొండ గణేష్ మూవీ

గద్దలకొండ గణేష్ మూవీ

తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది వాల్మీకి (గద్దలకొండ గణేష్) మూవీ. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X