Gaddalakonda Ganesh గత్తర లేస్తోంది.. మూడు రోజుల్లోనే ఎంత రాబట్టాడంటే..!

బాక్సాఫీస్ వద్ద గద్దలకొండ గణేష్ హవా కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 20 (శుక్రవారం) విడుదలైన ఈ సినిమా మూడో రోజు కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. విడుదలకు ఒక్క రోజు ముందే వాల్మీకి నుంచి గద్దలకొండ గణేష్ గా ఈ సినిమా పేరు మార్చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆ ప్రభావం ఈ సినిమా పై పడకుండా విజయవంతంగా రన్ అవుతుండటం ట్రేడ్ వర్గాల్లో ఆనందం చిగురింప జేస్తోంది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) చిత్రం తొలి రోజునే తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించింది. అదే జోష్ కొనసాగిస్తూ మూడు రోజుల్లో ఈ సినిమా 13.4 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ప్రస్తుతం గద్దలకొండ గణేష్ జోష్ చూస్తుంటే ఈ వారం అంతా వరుణ్ తేజ్ హవా కొనసాగుతుందని తెలుస్తోంది. చిత్రంలో వరుణ్ నటనపై సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు గుప్పిస్తుండటం సినిమాకు బాగా కలిసొచ్చే అంశం. పరిస్థితి చూస్తుంటే ఈ వారాంతం వరకు వసూళ్లు నిలకడగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Varun Tejs Gaddalakonda Ganesh 3 days collection report is

మరోవైపు యూఎస్‌లోనూ గద్దలకొండ గణేష్ వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నట్లు సమాచారం. ఈ వారం పెద్ద సినిమాల విడుదల లేకపోవడం ఈ సినిమా వసూళ్లకు అనుకూలించే మరో అంశం. అక్టోబరు 2న 'సైరా నరసింహా రెడ్డి' విడుదల వరకు గద్దలకొండ గణేష్ గత్తరను ఆపడం కష్టం అంటున్నారు విశ్లేషకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X