వారం తిరిగే సరికి గద్దలకొండ గణేష్.. ఇదీ వాల్మీకి 7 రోజుల రిపోర్ట్

బాక్సాఫీస్ వద్ద గద్దలకొండ గణేష్ హవా కొనసాగుతోంది. వరుణ్ తేజ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. విడుదలకు ఒక్క రోజు ముందే వాల్మీకి నుంచి గద్దలకొండ గణేష్ గా ఈ సినిమా పేరు మార్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుండటం ట్రేడ్ వర్గాల్లో ఆనందం చిగురింప జేస్తోంది. గత శుక్రవారం విడుదలైన గద్దలకొండ గణేష్ తొలివారం ముగిసే సరికి ఎంతరాబట్టింది..? ఆ వివరాలు చూద్దామా..

Recommended Video

Gaddala Konda Ganesh Collections || Valmiki Collections
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి

వాల్మీకి సినిమాలో గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ నటనకు ఫిదా అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు. మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా మొదటి వారం జర్నీ పూర్తిచేసిన గద్దలకొండ గణేష్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17.56 కోట్ల రూపాయల షేర్ రాబట్టాడు. వారం ముగిశాక కూడా గద్దలకొండ గణేష్‌ హవా కొనసాగుతూనే ఉంది.

ఏరియా వైజ్‌గా చూస్తే..

ఏరియా వైజ్‌గా చూస్తే..

ఏరియా వైజ్‌గా చూస్తే గద్దలకొండ గణేష్‌ కలెక్షన్ రిపోర్ట్ ఇలా ఉంది. నైజాంలో 6.52 కోట్లు, సీడెడ్‌లో 2.91 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.10 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1.29 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.21 కోట్లు, గుంటూరులో 1.51 కోట్లు, కృష్ణా జిల్లాలో 1.29 కోట్లు, నెల్లూరు జిల్లాలో 73 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా చూస్తే 17.56 కోట్లుగా నమోదైంది.

86 శాతం రికవరీ.. ఓవర్సీస్‌లో

86 శాతం రికవరీ.. ఓవర్సీస్‌లో

ఇక తెలుగు రాష్ట్రాలు మినహాయించి ఇతర రాష్ట్రాల్లో చూస్తే.. 1.25 కోట్లు, ఓవర్సీస్ లో 50 లక్షల షేర్ రాబట్టాడు గద్దలకొండ గణేష్‌. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారం ముగిసే సరికి గద్దలకొండ గణేష్‌ షేర్ 20.31 కోట్లుగా నమోదైంది. సో ఇప్పటిదాకా 86 శాతం రికవరీ సాధించినట్లే అని పేర్కొంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

గద్దలకొండ గణేష్‌ ప్రీ రిలీజ్ వివరాలు

గద్దలకొండ గణేష్‌ ప్రీ రిలీజ్ వివరాలు

ఇక గద్దలకొండ గణేష్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం హక్కులు రూ.7.4 కోట్లు, సీడెడ్ రూ.3.35 కోట్లు, ఆంధ్రా రూ.9 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి మొత్తం రూ.19.75 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు రూ.1.50 కోట్లు, ఓవర్సీస్ రూ.3 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రూ.24.25 కోట్లు జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X