Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్ రిపోర్ట్: లాభాల్లో రావాలంటే ఎంతంటే
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ (వాల్మీకి) చిత్రం భారీగా వసూళ్లను సాధిస్తున్నది. వారాంతం తర్వాత కాస్త కలెక్షన్లు తగ్గుముఖం పట్టినా నిలకడగానే వసూళ్లు ఉన్నాయి. గత మూడు రోజుల్లో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ చిత్రం ఎంత వసూళ్లు సాధించిందంటే..
మూడో రోజు కలెక్షన్లు
గద్దలకొండ గణేష్ మూడో రోజు నైజాంలో రూ.1.47 కోట్లు, సీడెడ్‌లో రూ.62 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.48 లక్షలు, గుంటూరులో రూ.29 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.38 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.26 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.22 లక్షలు, నెల్లూరులో రూ.17 లక్షలు వసూలు చేసింది.
వారాంతం తర్వాత వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో గద్దల కొండ గణేష్ మూడో రోజు రూ.3.89 కోట్ల షేర్ సాధించగా, మొత్తం మూడు రోజుల్లో రూ.12.95 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రానికి సంబంధించి సుమారు 20 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే ఇంకా 10 కోట్ల షేర్ సాధించాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది.
ఓవర్సీస్లో ఎంతంటే
ఇక ఓవర్సీస్లో వాల్మీకి చిత్రం హక్కులు రూ.2.70 కోట్లకు అమ్ముడుపోగా, ఇప్పటి వరకు రూ.1.30 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక మిగితా రాష్ట్రాల్లో 1.30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే.. ప్రస్తుతం 90 లక్షల వసూళ్లను సాధించింది.
లాభాల్లోకి రావాలంటే
ఇక ప్రపంచవ్యాప్తంగా సాధించిన వసూళ్లను పరిశీలిస్తే.. వాల్మీకి చిత్రం రూ.24 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు రూ.15.19 కోట్లు వసూలు చేసింది. ఇంకా సుమారు 9 కోట్ల రూపాయల షేర్ సాధించాల్సి ఉంది.