Ghani 3 Days Collections: వరుణ్ తేజ్‌కు భారీ షాక్.. ఆదివారం మరీ దారుణంగా.. 3 రోజులకు కలిపి ఇంతే!
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. నాగబాబు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకుని స్టార్‌డమ్‌ను దక్కించుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో వరుసగా విజయాల పరంపరతో ఫుల్ జోష్‌లో ఉన్న వరుణ్ తేజ్.. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' అనే సినిమాను చేశాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. అయితే, అనూహ్యంగా దీనికి స్పందన అంతగా రావడం లేదు. ఈ నేపథ్యంలో 'గని' మూవీ 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

బాక్సర్‌గా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రమే 'గని'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా.. నవీన్ చంద్ర నెగెటివ్ రోల్ చేశాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. నదియా, ఉపేంద్ర, సునీల్ శెట్టి నటించారు.

గని సినిమా బిజినెస్ డీటేల్స్ ఇవే
వరుణ్ తేజ్‌కు భారీ మార్కెట్ లేకున్నా 'గని' హక్కులకు బాగా పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.50 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 9.50 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 21 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.30 కోట్ల బిజినెస్ జరిగింది.

మూడో రోజు వచ్చిన కలెక్షన్లు ఇలా
'గని' మూవీకి మూడో రోజూ ఏపీ, తెలంగాణలో దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 28 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి రూ. 68 లక్షలు షేర్, రూ. 1.05 కోట్లు గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసింది.

మూడు రోజులకూ కలిపి వసూళ్లిలా
మూడు రోజులకు కలిపి 'గని' మూవీకి తెలుగు రాష్ట్రాలో తక్కువ కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 1.38 కోట్లు, సీడెడ్‌లో రూ. 43 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 58 లక్షలు, ఈస్ట్‌లో రూ. 31 లక్షలు, వెస్ట్‌లో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 27 లక్షలు, కృష్ణాలో రూ. 27 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో.. 3 రోజుల్లో రూ. 3.63 కోట్లు షేర్, రూ. 6.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత
ఏపీ, తెలంగాణలో కలిపి మూడు రోజులకు రూ. 3.63 కోట్లు వసూలు చేసిన గని మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ నిరాశ పరిచింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 24 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 31 లక్షలను మాత్రమే రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా మూడు రోజుల్లో కేవలం రూ. 4.18 కోట్లు షేర్‌తో పాటు రూ. 7.50 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?
క్రేజీ కాంబినేషన్‌లో భారీగా వచ్చిన గని మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 26.30 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 3 రోజుల్లో రూ. 4.18 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 22.12 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్ అందుకుంటుంది.


Click it and Unblock the Notifications











