Ghani Business: గనికి ఊహించని బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే వరుణ్ తేజ్ మూవీ హిట్
మెగా కాంపౌండ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆరంభంలోనే తనదైన టాలెంట్లతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మొదట్లోనే భారీ సక్సెస్‌లను ఖాతాలో వేసుకున్న అతడు.. స్టార్‌డమ్‌ను కూడా ఎంతో వేగంగా అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. కొంత కాలంగా వరుసగా హిట్లు కొట్టిన వరుణ్ తేజ్.. ఇప్పుడదే ఉత్సాహంతో 'గని' అనే సినిమాలో నటించాడు. బాక్సింగ్ నేపథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి అత్యధిక బిజినెస్ జరిగింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకొచ్చాయి. ఆ వివరాలు మీకోసం!

‘గని’గా రాబోతున్న వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గని' అనే సినిమాలో నటించాడు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. ఇక, ఈ సినిమాలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా.. నవీన్ చంద్ర విలన్‌గా చేశాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. నదియా, ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రలు చేశారు.

అలాంటి స్టోరీతో.. ఎమోషనల్‌గా
వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న వరుణ్ తేజ్ ఇప్పుడు ‘గని'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో రూపొందింది. ఇందులో మదర్ సెంటిమెంట్ ప్రధాన పాత్రను పోషిస్తుందని అంటున్నారు. తల్లికి, హీరోకు మధ్య జరిగే సన్నివేశాలు హైలైట్ కాబోతున్నాయని సమాచారం. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటించాడు.

వాయిదాలు.. ఫిక్సైన రిలీజ్ డేట్
భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ప్రేక్షఖుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ అనుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు డేట్లను కూడా ప్రకటించారు. కానీ, షూటింగ్ ఆలస్యం అయిన కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఇక, ఈ సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రమోషన్‌తో బిజీగా ఉన్న ప్రిన్స్
‘గని' సినిమా విడుదలకు సమయం ఆసన్నం అవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలను విడుదల చేయడంతో పాటు ఇప్పుడు చిత్ర యూనిట్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేస్తోంది. దీంతో దీని కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఇలా
వరుణ్ తేజ్ నటించిన ‘గని' మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలుపుకుని రూ. 9.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అంటే.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా రూ. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
Recommended Video


ప్రపంచ వ్యాప్తంగా జరిగింది ఇలా
మెగా ప్రిన్స్ వరుణ్ తజ్‌కు ఓవర్సీస్‌తో పాటు ఇండియాలోని పలు ప్రాంతాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఓవర్సీస్‌లో ‘గని' మూవీకి రూ. 1.80 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలనూ కలుపుకుంటే.. ఈ చిత్రానికి మొత్తంగా రూ. 25.30 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

అన్ని కోట్లు వస్తేనే సినిమా హిట్
వరుణ్ తేజ్ - కిరణ్ కొర్రపాటి కాంబోలో వస్తున్న ‘గని' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.30 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 26.30 కోట్లుగా ఉంది. అంటే.. అన్ని కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ కూడా భారీగానే ఉంటుందని తెలిసింది. అయితే, RRR ప్రభావం దీనిపై చూపే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications











