దుమ్ము రేపుతున్న వరుణ్ తేజ్.. 50 కోట్లపై కన్నేసిన తొలి ప్రేమ
ఫిదా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం తొలిప్రేమ. వరుణ్ తేజ్, అందాల తార రాశీఖన్నా కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 10న విడుదలై మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. తన కెరీర్‌లోనే ఉత్తమ కలెక్షన్లు సాధించిన చిత్రంగా వరుణ్ తేజ్ ఓ రికార్డును సొంతం చేసుకొన్నాడు. అలాగే ఈ చిత్రం రానున్న రోజుల్లో 50 కోట్లు వసూలు చేయవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. గత నాలుగు రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే..
Recommended Video


27 కోట్లు వసూలు
తొలిప్రేమ చిత్రం తొలి నాలుగురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.27 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. అమెరికా బాక్సాఫీస్ వద్ద టాప్ 25 చిత్రాల జాబితాలో ఈ చిత్రం చోటు సంపాదించింది. వర్కింగ్ డేస్‌లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టడం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజుల్లో తొలిప్రేమ చిత్రం 10.80 కోట్ల నికర వసూళ్లను, 17.4 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నైజాంలో రూ.4.10 కోట్లు, సీడెడ్‌లో 1.30 కోట్ల షేర్‌ను సాధించింది.

జిల్లాలో కాసులు వర్షం
ఏపీలోని నెల్లూరు జిల్లాలో 35 లక్షలు, గుంటూరులో 98 లక్షలు, కృష్ణాలో రూ.90 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 73 లక్షలు, తూర్పులో 91 లక్షల రూపాయలను కొల్లగొట్టింది.

అమెరికాలో భారీ కలెక్షన్లు
అమెరికాలో గురువారం ప్రదర్శించిన ప్రీమియర్ షోలకు రూ.98 లక్షలు వసూలైంది. శుక్రవారం రూ.1.8 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. గత నాలుగురోజుల్లో ఈ చిత్రం 4.65 కోట్ల గ్రాస్, రూ.2.10 కోట్ల షేర్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.1.5 కోట్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











