వాల్మీకి మూవీ 14 రోజుల కలెక్షన్లు.. గద్దలకొండ గణేష్‌కు ఎంత నష్టమంటే
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి (గద్దలకొండ గణేష్) చిత్రం బాక్సాఫీస్ వద్ద రెండు వారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రం ప్రారంభంలో మంచి వసూళ్లు నమోదు చేయగా.. రెండోవారంలో కాస్త కలెక్షన్లు నెమ్మదించాయి. ఈ చిత్రం రూ.30 కోట్లతో రూపొందగా, 11 కోట్ల మేర శాటిలైట్, స్ట్రీమింగ్, మ్యూజిక్ రైట్స్ లాంటి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా సంపాదించింది. అయితే లాభాల్లోకి రావాలంటే ఈ సినిమా ఎంత వసూలు చేయాలంటే..
ఇక 13వ రోజున ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో 8 లక్షల షేర్‌ను, 14వ రోజున 5 లక్షల షేర్‌ను సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం 16 లక్షలు గత రెండు రోజుల్లో నమోదు చేసింది.

ఇక వాల్మీకి చిత్రం 14వ రోజు పూర్తయ్యే సరికి తెలంగాణ, ఆంధ్రాలో రూ.21 కోట్ల మార్కును, ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల మార్కును దాటేసింది. గత పద్నాలుగు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
వాల్మీకి చిత్రం నైజాంలో 7.76 కోట్లు, సీడెడెలో రూ.3.41 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1.67 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.4 కోట్లు, గుంటూరులో రూ.1.8 కోట్లు, కృష్ణా రూ.1.4 కోట్లు, నెల్లూరులో రూ.82 లక్షలు వసూలు చేసింది.
మొత్తంగా వాల్మీకి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.37.65 కోట్ల గ్రాస్, రూ.24.01 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.24.25 కోట్ల మేర జరిగింది. అయితే 25 కోట్ల రూపాయాలతో బరిలోకి దిగిన గద్దలకొండ గణేష్ లాభాల్లోకి రావాలంటే.. మరో 1 కోటి రూపాయలు వసూలు చేయాల్సిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











